Health Benefits : గులాబీ, పసుపు కలర్లలో టమాటాలు.. మరింత రుచిగా, మరిన్ని పోషకాలతో..!
Health Benefits : టమాటా అనగానే ఎరుపు రంగు మాత్రమే గుర్తుకు వస్తుంది. కాయలైతే కొద్దిగా గ్రీన్, వైట్ కాంబినేషన్ కలర్‌లో ఉంటుంది. అయితే త్వరలో మార్కెట్‌లో టమాటాలు వివిధ వర్ణాల్లో కనిపించనున్నాయి. పింక్ కలర్ టమాటాలను అతి త్వరలోనే మన మార్కెట్లలో చూడవచ్చు. పసుపు, పింక్ కలర్‌లో ఉండే టమాటాలను మన సంతలో సందడి చేయనున్నాయి. థాయ్లాండ్, మలేషియా, ఐరోపా లో ప్రసిద్ధి చెందిన పింక్ టొమాటో.. త్వరలో భారత దేశంలో కూడా సందడి చేయడానికి రెడీ అవుతోంది. మన దేశ వాతారణ పరిస్థితులకు అనుగుణంగా పింక్ టమాటాను మార్చేశారు.
ఈ పింక్ టమాటాలు రుచికి బాగుంటాయి. అలాగే ఆరోగ్యంగానూ మంచి విలువలు ఉంటాయి. పింక్ టమాటాలు క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఎరుపు రంగు టమోటాల్లో పుష్కలంగా ఉన్న లైకోపీన్ పిగ్మెంట్.. ఈ పింక్ టమాటాలో తక్కువ సాంద్రతను కలిగి ఉంది. ఈ పింక్ టమాటా రకాన్ని 150-180 రోజులు సాగు చేస్తారు. 55 రోజులలో పంట ప్రారంభమవుతుంది. అయితే కిలోకు దాదాపు రూ. 25-30 ఖర్చవుతుంది. ఇది ప్రస్తుతం ఎర్ర టమోటా పంట ధర కంటే తక్కువ. ఇది ఇతర రకాల కంటే వేగంగా వండుతుంది.హైదరాబాద్‌లో వనపర్తి జిల్లా మోజర్లలోని హార్టికల్చర్ కళాశాలకు చెందిన జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పిడిగాం సైదయ్య.
.. పింక్ టమోటా, పసుపు టమోటా, ఎరుపు ఉసిరికాయ, యార్డ్ లాంగ్ బీన్స్ లోని మంచి విత్తన రకాలను ఉత్పత్తి చేస్తున్నారు.రెండు మేలు రకాల కలయికతో సృష్టించిన ఈ సంకర జాతి ఉత్పత్తుల్లో సాధారణ రకాల కంటే అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఎరుపు టమాటాలు చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఎలాంటి ఫ్రిజ్ అవసరం లేకుండానే చాలా రోజుల పాటు అలాగే ఉంటాయి. కానీ పింక్ కలర్ టమాటాలు చాలా సున్నితమైనవి. వీటి స్కిన్ చాలా పలుచగా ఉండటం వల్ల పాడవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవాణాచేసే సమయంలోనూ టమాటాలు చిదిమిపోతాయి. ఈ పింక్ టమాటాలు పూరీ కూర, సాంబారు, చట్నీలకు ఈ రకం అనువైనవని ప్రొఫెసర్ చెబుతున్నారు. పసుపు టమాటోలో బీటా కెరోటిన్, ప్రొవిటమిన్ A ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.