Health Tips : ప్రతి రోజూ అన్నం తింటున్నారా? అయితే మీకు ఇబ్బందులు తప్పవు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ప్రతి రోజూ అన్నం తింటున్నారా? అయితే మీకు ఇబ్బందులు తప్పవు..

 Authored By mallesh | The Telugu News | Updated on :2 February 2022,8:40 pm

Health Tips : ఇంట్లో పల్లెంలో అన్నం వేసుకున్న తర్వాత దానిని మొత్తం తినాలని, కింద పడనివ్వకూడదని, పారేయకూడదని పెద్దలు చెబుతుంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటుంటారు. అన్నాన్ని దైవంగా భావిస్తారు. అందుకే అన్నదాత సుఖీభవ అంటారు. కాలితో అన్నాన్ని తాకొద్ద. ఇలా చాలా సంప్రదాయాలు ప్రతి రోజూ మన ఇండ్లల్లో చూస్తూనే ఉంటారు. మన దేశంలో చాలా మంది మూడు పూటలు అన్నం తింటుంటారు. ఉత్తరాధిలో మాత్రం ఎక్కవగా రోటీలు, చపాతీలు తింటుంది. ఇక దకిణాదిలో అన్నానికే ప్రయారిటీ ఇస్తారు. కానీ మూడు పూటలు అన్నం తినడం మంచిది కాదట.

దీని వల్ల బాడీకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయట. మరి అవేంటో తెలుసుకుందామా..అన్నం ఎక్కువగా తింటే ఈజీగా లావవుతారు. ఇందులో అన్నంలో ఉండే క్యాలరీలు సాయపడుతాయి. అందుకే డైటింగ్ చేసే వారు అన్నంత తక్కువగా తీసుకుంటారు. అన్నం త్వరగా కడుపు నింపుతుంది. కానీ అతిగా తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. అన్నం తినగానే పడుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత కాస్త వాకింగ్ చేయడం బెటర్. మధుమేహం ఉన్న వారు రాత్రి పూట అన్నం తినొద్దు.

problems with eating too much rice

problems with eating too much rice

Health Tips : సమస్యలు, బరువు పెరగడం

ఒక వేళ తింటే అది వ్యాధి ప్రభావాన్ని మరింతగా పెంచే చాన్స్ ఉంది. ఫలితంగా బాడీలో షుగర్ లెవల్ సైతం పెరుగుతుంది. చాలా మందికి బియ్యం తినడం అలవాటుగా ఉంటుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే చాన్స్ ఉంటుంది. అన్నం ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. మరి ప్రతి రోజూ ముడు పూటలు అన్నం తినే వారు ముందు నుంచే కాస్త జాగ్రత్త పడాలి మరి. లేదంటే సమస్యలకు గురి కాక తప్పదని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది