Punarnava : ఈ మొక్కను ఎప్పుడైనా చూశారా… రోడ్డుపై విసిరి పడినట్లుగా మొలుస్తుంది.. ఇది చిన్న మొక్క అయినా దీని గురించి తెలిస్తే…?
ప్రధానాంశాలు:
Punarnava : ఈ మొక్కను ఎప్పుడైనా చూశారా... రోడ్డుపై విసిరి పడినట్లుగా మొలుస్తుంది.. ఇది చిన్న మొక్క అయినా దీని గురించి తెలిస్తే...?
Punarnava : ఈ చిన్న మొక్క రోడ్డుపైన విసిరి పడినట్లుగా మొలుస్తుంది. కొందరు ఈ మొక్క తెలియక ఇది పిచ్చి మొక్క అని అనుకుంటారు. మనకు తెలియని విషయం ఏంటంటే కొన్ని మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అవి చూడడానికి ఒక పిచ్చి మొక్క లాగా ఉంటాయి. ఎందుకు పనికిరాదు అని అనుకుంటాను. కానీ ఆయుర్వేద నీపునులకు ప్రతి ఒక్క మొక్క గురించి తెలుసు. పూర్వంలో కూడా ఈ మొక్కలనుంచే ఔషధాలు తయారుచేసి వినియోగించేవారు. అడవిలో దొరికే మూలికలు గురించి పూర్వంలో ఎక్కువగా అవగాహన ఉంది. పూర్వకాలంలో ఇటువంటి మొక్కల మంచి ఔషధాలు అనేది తయారు చేసేవారు. ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇటువంటి మొక్కల నుంచి ఔషధాన్ని తయారు చేసేవారు. ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలు ఉన్నాయి. ఎంతో తీవ్రమైన వ్యాధులను కూడా చికిత్స చేయగలిగే గుణం ఈ మూలికలకు నిరూపించబడింది. అటువంటి ప్రభావవంతమైన ఔషధం’ పునర్నవ’ ఇది ఒక చిన్న మౌలిక. ఇది చూడడానికి చిన్న మొక్క అయినా ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణి. అమృతం వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది మంటను తగ్గించేది లేదా గదా పూర్ణ అని కూడా అంటారు. ఈ మూలిక తినడానికి చేదుగా మరియు ఘాటుగా కూడా ఉంటుంది. దీని వినియోగం అనేక తీవ్రమైన వ్యాధులను చికిత్స చేయడానికి ఎంతో ప్రవంతమైనదిగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో నిరూపించబడింది.

Punarnava have-you-ever-seen-this-plant-it-sprouts-like-it-was-thrown-on-the-road
ఈ మొక్క గురించి నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన ఒక అధ్యయనములో పునర్నవ మ్యాడ్యులేషన్, హెపాటో ప్రొటెక్షన్, క్యాన్సర్ వ్యతిరేక, డయాబెటిస్ వ్యతిరేక, వాపు వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఈ లక్షణాలు శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించడానికి ఏ సహాయపడుతుందని రుజువు చేశారు. దీంతో పాటు మెగ్నీషియం సోడియం క్యాల్షియం పొటాషియం అంటే ఖనిజాలు కూడా కలిగి ఉంటాయి.పునర్నవను ప్రధానంగా మూత్రపిండాలు, ఈ మూలికను మూత్ర సమస్యల చికిత్సలో వినియోగిస్తారు. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతో ఉపకరిస్తుంది. గుండె పనితీరు మెరుగ్గా ఉండుటకు సహాయపడుతుంది. బీపీని నియంత్రించగలదు. పునర్నవ అనేది గుండె మరియు మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో సహా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్నది ఒక ఔషధమూలిక.
ఈ పునర్నవ మొక్క ఉపయోగాలు మూత్రపిండాలకు మరియు గుండెకు మాత్రమే పరిమితం కాదు. ఈ మూలిక కామెర్లు మరియు జ్వరం, ఊబకాయం, ఉబ్బసం, రే చీకటి వంటి సమస్యలను కూడా నయం చేయగలదు. పునర్నవ వేరు రసం రే చీకటితో బాధపడే వారికి ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఈ రే చీకటి వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అదనంగా, సమయోచితంగా ఉపయోగించడం వల్ల నొప్పి, వాపును కూడా తగ్గించగలదు. ఊబ్బకాయం, జలుబును నయం చేస్తుంది. పేగు పురుగులను చంపుతుంది. చర్మవ్యాధులు, రక్తహీనతను ప్రయోజనకరంగా చేస్తుంది. బద్ధకం వంటివి కూడా నివారిస్తుంది. పునర్నవ వినియోగం వ్యాధిని బట్టి మారుతుంది. రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ పునర్నవ రసం కలిపి తాగితే సురక్షితం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. రక్తహీనతకు ముఖ్యంగా చక్కని పరిష్కారం అందించగలరు అంటున్నారు నిపుణులు. ఈ మొక్క రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి దివ్య ఔషధం. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచగలిగే శక్తిని కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కారణమయ్యే ఐరన్ ఔషధ మొక్కలు ఉంటుంది. ఉత్పత్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఇందులో ఉంటాయని ఓ అధ్యయనంలో తెలిపారు. అనీమియా రక్త కణాల లోపంతో బాధపడుతున్న వారిని క్రమం తప్పకుండా ఈ మొక్క తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.