Cough : దగ్గు దగ్గి దగ్గి గొంతు నొప్పి పుడుతుందా..? ఇంత ఆకు నోట్లో వేసుకోండి చాలు… దగ్గు ఆనవాళ్లు లేకుండా పోతుంది…!
ప్రధానాంశాలు:
Cough : దగ్గు దగ్గి దగ్గి గొంతు నొప్పి పుడుతుందా..? ఇంత ఆకు నోట్లో వేసుకోండి చాలు... దగ్గు ఆనవాళ్లు లేకుండా పోతుంది...!
Cough : సీజన్ మారింది ఏ సీజన్ అయినా సరే మారినప్పుడు ఆరోగ్య పరిస్థితిలో చాలామందికి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఆరోగ్య పరిస్థితిలో కొంచెం ఎక్కువగా ఉంటాయి.. చాలామంది వీటిలో ఎక్కువగా దగ్గు జలుబు జ్వరం వస్తూ ఉంటుంది. చాలామందికి అయితే ఈ దగ్గు జలుబు వంటివి కొన్ని రోజులు ఉండి తగ్గిపోతే పర్వాలేదు.. కానీ ఎక్కువ రోజులు అంటే వారాల తరబడి ఉంటే గనుక కచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దగ్గు గనక ఎక్కువ రోజులు వస్తూ ఉంటే కచ్చితంగా మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాల్సిందే.. అయితే ఇలా దగ్గు ని తొందరగా తగ్గించుకొని దగ్గు సమస్య నుంచి చక్కగా బయటపడే మార్గం చెబుతాను.. అయితే మీరు ఇప్పటివరకు మందులు వాడి విసిగిపోయి ఉన్నా మీకు ఇప్పుడిప్పుడే దగ్గు సమస్య వస్తున్న.. లేదా.. ఎలాంటి రెమెడీస్ మీకు పనిచేయకపోతే ఈ ఒక్కరేమిడి వాడి చూడండి.. అద్భుతంగా మీ దగ్గు తగ్గిపోయి తీరుతుంది.
అలాగే వాటి కారణాలు కూడా ప్రధానంగా ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటి దగ్గులు వస్తాయి.. అయితే మనం ఇప్పుడు చెప్పుకొని అన్ని రకాల దగ్గులకీ దివ్య ఔషధంగా ఉపయోగపడే ఇంటి చిట్కాను ఇప్పుడు చెప్పబోతున్నాను.. అది కూడా సింపుల్ గా మీరు తయారు చేసుకోవచ్చు.. పైసా ఖర్చు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సింపుల్ టిప్ దీనికి మీరేం చేయాలంటే ఒకే ఒక్క తమలపాకు ఒక చిటికెడు వాముతో దగ్గు సమస్య పూర్తిగా పరారైపోతుంది. ఆశ్చర్యంగా ఉంది కదా.. రోజు తమలపాకు వాము కలిపి వేసుకోవాలి. ఇలా తినడం వలన తలనొప్పి, అధిక ఒత్తిడి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటాయి.
నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు తమలపాకు వాము చేర్చి తింటే నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా నాశనమై బ్యాడ్ స్మెల్ రావడం తగ్గుతుంది..తమలపాకు ఎంత దివ్య ఔషధంగా పనిచేస్తుందో మరి ఇప్పుడు దగ్గు కోసం తమలపాకును ఎలా వాడాలో చూద్దాం.. ముందుగా ఒక తమలపాకును తీసుకుని శుభ్రంగా కడిగేయండి. అలా కడిగిన తర్వాత రెండు చివర్లు కట్ చేయండి. దానిలో ఒక స్పూను వాముని చేర్చి దానిని మడత పెట్టి ప్రతిరోజు తినండి.. ఇలా తినడం వలన దగ్గు సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు…