ఎండిపోతున్న మొక్కలను బ్రతికించే సంజీవని…!
మనం ఆరోగ్యంగా ఉండడానికి నీళ్లు ఎంత అవసరమో మొక్కలకు కూడా నీళ్లు అంతే అవసరం. చాలామంది అనుకుంటారు మంచి ఎరువు వేసి మంచి కుండీలో వేసి సూర్యరష్మి చక్కగా తగిలేలా ఉంటే నీరుఎక్కువగా పోయకపోయినా మొక్కలు బానే ఉంటాయి అనుకుంటారు. మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పెట్టడం కుదరక మనం తిరిగి వచ్చేసరికి చాలా మొక్కలు పాడైపోయి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనం రోజువారి నీళ్లు పెడుతున్నా గానీ కొన్ని మొక్కలైతే కళావిహీనంగా ఎదుగు బదులు లేకుండా ఏ ఫలాలు పువ్వులు కాయకుండా ఉంటూ ఉంటాయి. ఇటువంటి మొక్కలకు ఎలా జీవాన్ని ఇవ్వాలి. ఎప్పుడు కళకళలాడుతూ ఆరోగ్యంగా మొక్కలు ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. ఒక అద్భుతమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోబోతున్నాం. ఇది గనుక మీరు మొక్కలకు వేస్తే మొక్కలు నీగినెగలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఆ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. కలబంద మొక్క గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఇది సర్వసాధారణంగా చాలామంది ఇళ్లల్లో పెరుగుతూ ఉంటుంది.
దీనికి పెద్దగా సూర్యరశ్మి అవసరం లేదు. కాబట్టి చిన్న చిన్న కుండీలో బాల్కనీలో పెరడులో వంటగదిలో కూడా కొంతమంది పెంచుకుంటూ ఉంటారు. అంతెందుకు కలబంద దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఇదే కలబందతో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోబోతున్నాం. దీనికి కేవలం ఒక్క ఆకు సరిపోతుంది. అది కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండే ఒక కలబంద ఆకులు కట్ చేసుకోండి. ఆ మొదల నుంచి మనకు ఎల్లో కలర్ లో జల్లో ఒకటి వస్తుంది. ఇది నిజంగా పాయిజన్ కాబట్టి ఎవరు వాడకూడదు. లేదంటే ఒక అంగుళం వరకు ముక్క అయినా మనం కట్ చేసేసుకోవాలి. ఈ ఎల్లో కలర్ జల్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడకుండా ఆ ముక్కలు కట్ చేసి ఆ తర్వాత మనం వాడుకోవచ్చు. కలబందను శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలు గా కట్ చేయండి. ఒక బౌల్లో రెండు లీటర్ వాటర్ పోసి ఇలా రెండు లీటర్ల వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న కలబంద పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్ ని ఈ నీటిలో వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక క్లాత్ ని పైన కప్పండి. లేదంటే ఒక మూత ఉంటే పైన పెట్టండి.. ఇప్పుడు ఈ దీనిని నీడలోనే మూడు రోజులు పాటు అలా వదిలేయండి. మూడు రోజుల తర్వాత ఈ వాటర్ మనం కట్ చేసుకున్న కలబంద జెల్ పూర్తిగా ఈ వాటర్ లో కలిసిపోయి ఆకులు కూడా కనిపించినంతగా ఫెర్మెంటైపోయింది.
ఇప్పుడు ఈ నీటిని మీరు వడకట్టాల్సిన అవసరం కూడా లేదు.. కాకపోతే చేతితో ఒకసారి మ్యాచ్ చేయండి. అయితే ఈ లిక్విడ్ ని మీరు మొక్కలపైన స్ప్రే చేయాలంటే కనుక ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్ లో వేసి స్ప్రే చేయొచ్చు. లేదా మొక్కలకు డైరెక్ట్ గా వేయాలి అనుకుంటే మనం వడకట్టాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ వాటర్ ని ఎలా వాడాలో చూద్దాం. ఒక వంతు లిక్విడ్ ఫెర్టిలైజర్ కి 500 వాటర్ ని కలపాలి. ఈ లిక్విడ్ పెట్టలేసర్ లో మనం ఎటువంటి కెమికల్ వాడలేదు. కాబట్టి చాలా చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు కూడా ఈ లిక్విడ్ని వాడొచ్చు. అంటే మనం నారు మొక్కలను వేసుకుంటాం కదా వాటికి కూడా ఈ లిక్విడ్ అప్లై చేయొచ్చు..ఇప్పుడు ఒక బకెట్ తీసుకుని ఐదు మొక్కలు ప్లైన్ వాటర్ కి ఒక మగ్గు మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ వేయండి.
ఇలా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ లిక్విడ్ ని మీరు ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్ డోర్ ప్లాంట్స్ అయినా ఏ మొక్కకైనా మీరు చక్కగా వాడొచ్చు.. ఏదేమైనా ఈ లిక్విడ్ ని మీరు 15 రోజులకు ఒకసారి మొక్కలకు వేయండి. చాలా ఆరోగ్యంగా బలంగా ఎదుగుతాయి మొక్కలు. ఇలా ఈ ఫెర్టిలైజర్ వాడుతుంటే మొక్కలకు కావాల్సిన అన్ని మినరల్స్ చక్కగా అందుతాయి.