Shanku Flowers : శంకు పూల మొక్క మీ ఇంట్లో ఉంటే… ఏం జరుగుతుందో తెలుసా…?
ప్రధానాంశాలు:
Shanku Flowers : శంకు పూల మొక్క మీ ఇంట్లో ఉంటే... ఏం జరుగుతుందో తెలుసా...?
Shanku Flowers : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం శంఖు పూల మొక్క ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే. శంఖుపూల మొక్క తీగ జాతికి చెందిన మొక్క. చాలామంది ఇళ్లల్లో శంఖు పుష్పం మొక్కలను పెంచుకుంటారు. ఈ మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో పెంచితే మంచిది.. ఈ మొక్క ఇంట్లో ఉంటే మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది. మొక్క నుంచి చిన్న శంకు పుష్పాలు దేవునికి ఏ ఏ రోజుల్లో ఎలా వినియోగిస్తారు.. శంఖు పుష్పం ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం…

Shanku Flowers : శంకు పూల మొక్క మీ ఇంట్లో ఉంటే… ఏం జరుగుతుందో తెలుసా…?
Shanku Flowers శంఖు పూల మొక్క వాస్తు నియమాలు
శంకు పుష్పాలు తీగ జాతికి చెందిన మొక్కలు. పూలు నీలం రంగులో ఉంటాయి. శంఖు పూలు శివునికి ఎంతో ప్రీతి. ఇన్కం ఆకారంలో ఉంటాయి కాబట్టి, వీటిని పూలు అంటారు. శాస్త్రం ప్రకారం శంఖు పూల చెట్టు ఇంట్లో ఉంటే, అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం. ఇంకో పూల మొక్కను ఉత్తర దిశలో, తూర్పు,ఈశాన్య దిశలలో నాటితే మంచి జరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున కుండీలో పెడితే శుభప్రదంగా ఉంటుంది. పూల మొక్కను గురువారం, శుక్రవారం నాటితే మంచి జరుగుతుంది.
Shanku Flowers విష్ణువుకు, లక్ష్మీదేవికి శంఖు పూలతో పూజ చేస్తే సకల సంపదులే
శంఖు పూలు ఎంతో పవిత్రమైనవి. ఈ పూలతో దేవుళ్లకు ఆయా రోజుల్లో పూజలు చేస్తుంటారు. శంఖు పూలతో శ్రీమహావిష్ణువుని లక్ష్మీదేవతలను పూజిస్తారు. ఈ శ్రీమహావిష్ణువుని, మహాలక్ష్మి దేవతను శుక్రవారం ఈ శంఖు పూలతో పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం. ఈశ్వరునికి కూడా శంఖు పువ్వులు అంటే చాలా ప్రీతి. కాబట్టి, శనివారం నాడు శనీశ్వరునికి పూజకు శంఖు పూలను వినియోగించండి.
Shanku Flowers శనివారం శంఖు పూలతో శనిదేవుని పూజిస్తే చాలా మంచిది
శనివారం రోజున 9 పూలతో శనిదేవునికి పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ దేవుని కటాక్షం తప్పక కలుగుతుంది. ఈ దేవునికి పూజలు చేసిన పూలను నీటిలో వేయండి మీ పైన ఉండే శని నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుందని చెబుతారు. విధంగా ఒక మూడు వారాలు చేసిన శనీశ్వరుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. అంటే, మీకు ఆర్థిక సమస్యలు ఉండవు.
శంఖు పూలతో హనుమాన్ పూజలు చేస్తే కలిగే ఫలితాలు ఇవే : ఉద్యోగ అవకాశాలు లేని వారికి శంఖు పూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. పెళ్లి కాకపోయినా,ఉద్యోగం లేనివారికి దొరుకుతుంది. వ్యాపార రంగంలో స్థాయిలకు ఎదుగుతారు. మంగళవారం రోజున శంఖు పాలతో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి 11 పుష్పాలను తమ గుప్పిట్లో పట్టుకొని మీ సమస్యలను మీ మనసులో తలుచుకొని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పుష్పాలను ఉంచాలి. చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్వయంగా ఆంజనేయస్వామి మీ తోడుగా ఉండి మీ సమస్యలను ఒక పరిష్కరిస్తాడు అని పండితులు చెబుతున్నారు.