Orange Peels : మీ చర్మం అందంగా మెరవాలంటే… నారింజ తొక్కలను ఇలా వాడండి…??
ప్రధానాంశాలు:
Orange Peels : మీ చర్మం అందంగా మెరవాలంటే... నారింజ తొక్కలను ఇలా వాడండి...??
Orange Peels : ప్రతి ఒక్కరు అందంగా ఉండాలి అని అనుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్లు అందం విషయంలో అస్సలు రాజీపడరు. అలాగే తమ అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. వీటితో పాటుగా ఇంట్లో కొన్ని రకాల బ్యూటీ టిప్స్ ను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మీరు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే మీ ఇంట్లో వాడే నారింజ తొక్కలతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నారింజ తొక్కలలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని అందంగా మార్చడంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఈ నారింజ తొక్కలతో ఎన్నో రకాల చర్మ సమస్యలను కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ నారింజ తొక్కలు ముఖంపై ఉండే మచ్చలు మరియు ముడతలను తగ్గించి, స్కిన్ ను గ్లోయింగ్ గా చేయడంలో చాలా బాగా పని చేస్తుంది. అంతేకాక ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఈ నారింజ తొక్కలను వాడతారు. మరి ఈ నారింజ తొక్కలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం…
స్క్రబ్ : ఫేస్ కి స్క్రబ్ అనేది చాలా అవసరం. స్క్రబ్ చేయటం వలన చర్మంపై ఉండే మృత కణాలు అనేవి పోయి, వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. దీని కోసం నారింజ తొక్కలను శుభ్రంగా కడుక్కొని, ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇది బాగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా చక్కెర మరియు తేనె, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫేస్ కి బాగా స్క్రబ్ చేయాలి. దీంతో ముఖంపై ఉండే దుమ్ము మరియు మురికి అనేది పోయి క్లియర్ గ్లోయింగ్ గా మారుతుంది. అలాగే స్కిన్ కూడా ఎంతో సాఫ్ట్ గా మారుతుంది…
పేస్ ప్యాక్ : ఈ నారింజ తొక్కల పొడి తో ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు. దీంతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. ఈ నారింజ తొక్కల పొడిలో టమాటా రసం మరియు పెరుగు, పాలు, ఆలివ్ ఆయిల్, తేనె వీటిలో ఏది కలిపి రాసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ ను ఒక పావు గంట సేపు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీంతో మీ చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది…
టోనర్ : నారింజ తొక్కలను వాడి టోనర్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టోనర్ వలన మీ ముఖం ఫ్రెష్ గా మరియు ఎంతో అందంగా మెరుస్తుంది. దీనికోసం ఈ నారింజ తొక్కలను శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకున్నా లేక టోనర్ గా వాడినా, ముఖం పై ఉన్న మచ్చలు మరియు ముడతలు అనేవి పోయి, ముఖం గ్లోయింగ్ గా మారుతుంది