Sleep And Brain Function : తొందరగా నిద్రపోయేవారు 20%… ఆలస్యంగా నిద్రపోయేవారు 80%…
ప్రధానాంశాలు:
తొందరగా నిద్రపోయేవారు 20%... ఆలస్యంగా నిద్రపోయేవారు 80%.
మీరు ఆలస్యంగా నిద్రిస్తున్నారా .. అయితే మీకు ఈ అనారోగ్య సమస్యలు తప్పవు ..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది చాలా ఆలస్యంగా నిద్రపోవడం అనేది సాధారణ విషయంగా మారిపోయింది
Sleep And Brain Function : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది చాలా ఆలస్యంగా నిద్రపోవడం అనేది సాధారణ విషయంగా మారిపోయింది. త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ళ కంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా నిద్రలేచే వాళ్ళ మెదడు పనితీరులో తేడాలుంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించి కొన్ని సర్వేలు కూడా అదే విషయాలు వెల్లడిస్తున్నాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు డమ్మీ అయిపోతుంది. అంత ఆలోచన శాతం తగ్గిపోయి ఎప్పుడూ మందకుడిగా తయారవుతారట. పనుల్లో చురుకుదనం తగ్గిపోవడంతో పాటు ఏకాగ్రత లోపించి అనేక సమస్యలు తలెత్తుతాయని వివరించారు. సూర్యోదయం సమయంలో నిద్ర పోవడం వల్ల విటమిన్ డి కూడా శరీరానికి అందదు అని చెప్తున్నారు. చాలా త్వరగా మరణించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆలస్యంగా నిద్రలేచే వారిలో మానసిక వ్యాధులు శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఈ సర్వేలో వెల్లడైంది.అలాగే వీళ్ళు ఏ విషయాన్ని కూడా అంత సీరియస్గా తీసుకోరు
. దీనితో వారికి డైలీ లైఫ్ లో ఎన్నో సమస్యలు, గొడవలు ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ సమయం మేల్కొనే వారిలో అల్జీమర్స్ కారకాలు డెవలప్ అవుతాయని దాని కారణంగా మతిమరుపు వస్తుందని కూడా చెప్తున్నారు. తమను గుర్తుపట్టలేని విధంగా అయిపోతారట. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రాత్రిపూట త్వరగా పడుకుని సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా కూడా చురుగ్గా ఉండారని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే హాయిగా నిద్రపోయే వారంతా అదృష్టవంతులు అంటారు. ఇలా పడుకోగానే అలా నిద్రపోయేవారు చాలా అదృష్టవంతుడట. అలా నిద్రపోయే వాళ్ళ శరీరం పునరుత్తేజం పొంది ఉత్సాహంగా మళ్ళీ పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. పైసా ఖర్చు లేకుండా అందం ఆరోగ్యం ఉత్సాహాన్ని ఇచ్చే నిద్రను చేజేతులా చేజార్చుకుంటుంది ఈ తరం. సమయానికి నిద్రపోకుండా ఆలస్యం చేయడం ఉదయాన్నే నిద్ర లేకపోవడం వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
లేటుగా నిద్రలేచే వారిలో రోగనిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుందని చెప్తున్నారు. రాత్రి త్వరగా భోజనం చేయడం త్వరగా నిద్రపోవడం మంచి అలవాటు. అలాంటి అలవాటు ఉంటే ఆరోగ్యం పాడవదు. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంటికి ఒంటికి మంచిది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని సూచిస్తున్నారు. మూడున్నర నుంచి ఐదున్నర గంటలలోపు నిద్ర లేవని ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఆలోచనలు కూడా పాజిటివ్ గా రావడం, సమాజంలో అందరితోనూ ఆనంద ఉత్సాహాలతో జీవించడానికి వీలుగా ఉంటుంది. పూర్వం మన పెద్దలు ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల లోపే నిద్రలేచి స్నానం చేసేసి సూర్య నమస్కారాలు చేయడం వంటివి చేసి ఎన్నో ఏళ్ళు ఆరోగ్యంగా జీవించారు. మనం కూడా ఇలా ఫాలో అవ్వకపోతే 25 ఏళ్లకే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇంకా పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…