Sleeping positions : రాత్రిళ్ళు నిద్ర రావడం లేదా ..? ఈ పొజిషన్లో పడుకుంటే వెంటనే నిద్ర పట్టేస్తుంది తెలుసా ..??
Sleeping positions : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రశాంతంగా నిద్ర పోవడం ఒక వరం లాంటిది. నిద్ర లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనిషి రోజంతా ఎంత పనిచేసిన రాత్రిళ్ళు కంటి నిండా నిద్రపోతే ఉదయాన్నే యాక్టివ్ గా ఉంటాడు. లేదంటే చికాకుగా, అలసటగా ఉంటుంది. అయితే చాలామందికి రాత్రిళ్ళు అంత తొందరగా నిద్ర పట్టదు. నిద్ర లేకపోవడం వలన ఏకాగ్రత లోపిస్తుంది. నిద్ర రావటానికి వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే నిద్రపోయేటప్పుడు పడుకునే […]

Sleeping positions : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రశాంతంగా నిద్ర పోవడం ఒక వరం లాంటిది. నిద్ర లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనిషి రోజంతా ఎంత పనిచేసిన రాత్రిళ్ళు కంటి నిండా నిద్రపోతే ఉదయాన్నే యాక్టివ్ గా ఉంటాడు. లేదంటే చికాకుగా, అలసటగా ఉంటుంది. అయితే చాలామందికి రాత్రిళ్ళు అంత తొందరగా నిద్ర పట్టదు. నిద్ర లేకపోవడం వలన ఏకాగ్రత లోపిస్తుంది. నిద్ర రావటానికి వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే నిద్రపోయేటప్పుడు పడుకునే భంగిమ కూడా మన ఆరోగ్యం మీద కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. కొందరు కుడివైపు తిరిగి పడుకుంటే మరి కొంతమంది ఎడమవైపు తిరిగి పడుకుంటారు. అలాగే ఇంకొంతమంది బోర్లా పడుకుంటారు. అయితే ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. ఎడమ వైపు తిరిగి పడుకునే వారిలో మెదడు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమై వ్యర్ధాలు, టాక్సిన్ లు వంటివి పెద్ద ప్రేగు ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ఎడమ వైపు తిరిగి పడుకుంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు గుండె ఎడమ వైపున ఉంటుంది.
ఎడమ వైపు తిరిగి పడుకుంటే గుండెకు సులభంగా రక్తం సరఫరా అవుతుంది. దీనివలన గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గర్భిణీలు ఎడమ వైపు తిరిగి పడుకుంటే చాలా మంచిది. దీనివలన గర్భాశయానికి, పిండానికి రక్తప్రసరణ బాగా జరిగి బిడ్డ ఎదిగేందుకు తోడ్పడుతుంది. బిడ్డకు పోషకాలు సులభంగా అందుతాయి. అందుకే గర్భిణీ ఎడమ వైపు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆయాసం, గురక ఉన్న వారు కూడా ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిది.