Sleeping Positions : నిద్రపోయేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి… ప్రమాదం…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sleeping Positions : నిద్రపోయేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి… ప్రమాదం…!

Sleeping Positions : సాధారణంగా మన పెద్దవాళ్లు మనకు వీటి గురించి చెప్తూనే ఉంటారు. మనం నిద్రపోయేటప్పుడు ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంచుకోవాలి. ఎలాంటి వస్తువులు ఉంచుకోకూడదు.. ఎలా పడుకుంటే మనకు దోషాలు దగ్గరకు రావు ఏమేం వస్తువులు ఎక్కడ పెట్టాలి? ఇలాంటి వాటి గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను.. మన అమ్మమ్మలు, తాతయ్యలు ఈ విషయాలు మీలో చాలామందికి చెప్పే ఉంటారు. ఇంకా చాలామందికి వీటి గురించి అసలు తెలియదు. ఇలాంటి తప్పులు చేయడం […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 July 2023,8:00 am

Sleeping Positions : సాధారణంగా మన పెద్దవాళ్లు మనకు వీటి గురించి చెప్తూనే ఉంటారు. మనం నిద్రపోయేటప్పుడు ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంచుకోవాలి. ఎలాంటి వస్తువులు ఉంచుకోకూడదు.. ఎలా పడుకుంటే మనకు దోషాలు దగ్గరకు రావు ఏమేం వస్తువులు ఎక్కడ పెట్టాలి? ఇలాంటి వాటి గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను.. మన అమ్మమ్మలు, తాతయ్యలు ఈ విషయాలు మీలో చాలామందికి చెప్పే ఉంటారు. ఇంకా చాలామందికి వీటి గురించి అసలు తెలియదు. ఇలాంటి తప్పులు చేయడం వలన మన ఇంటికి వచ్చే అదృష్టం అట్నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు మేము చెప్పే విషయాలు మీరందరూ తప్పక పాటించాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు. సరే ఇంకా అసలు విషయాలు ఏంటో మనం చూసేద్దాం పదండి.. మనుషులు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వారి జీవితంలో సుఖశాంతులు మరియు అదృష్టం కలుగుతుందట.. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిన వాళ్లకు ఎటువంటి రోగాలు దగ్గరకు రావు..

వారు ఎప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. వారిలో నిరాశ అనేది ఎప్పటికీ కనపడదు.. వారు తమ పనులను పూర్తి ఏకాగ్రతతో చేస్తారు. వారి మీద దేవుడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందట.. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం ఎలా ఉండాలి. అనే వాటి గురించి మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి. ఈరోజుకి కూడా మనలో చాలా మంది వాటిని పాటిస్తున్నారు. మన ప్రాచీన కాలంలోనే మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రిందకి ఈ విషయాన్ని గురించి చెప్పారు. వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే ముందు మనం కొన్ని వస్తువులు మన దగ్గర ఉంచుకోకూడదు. అలా చేస్తే కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. సుఖసంతోషాలు దూరం అయిపోతాయి. విద్యార్థులు సరిగ్గా చదవలేరు.. ఉద్యోగం చేసే వాళ్ళను అనుస్థితి ఏర్పడుతుంది..

sleeping positions

sleeping positions

డబ్బు త్వరగా బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఆర్థికంగా కూడా వెనకబడిపోతారు. కాబట్టి మీరు నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులను ఎప్పుడూ తమ దగ్గర ఉంచుకోకండి. అలా అయితే అదృష్టం మీ వెంటే ఉంటుంది. సరే అసలు ఏమేం వస్తువులు మన దగ్గర పెట్టుకోకూడదు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక మొదటిది పడుకునే ముందు మీ కాళ్ళను దక్షిణం వైపుగా ఉంచి పడుకోకూడదు. నిజానికి మన కాళ్ళను ఉత్తరం వైపుగా గాని లేదా పశ్చిమ వైపుగా గాని పెట్టుకొని పడుకోవాలి. అలాగే మీ తలను దక్షిణ దిశగా పెట్టుకుని పడుకోవాలి. ఇలా చేస్తే మీలోని చెడు శక్తులు బయటకు పోతాయి. విషయం పడుకునే గదిలో ఏ మూలా కూడా చీపురు ఉంచకూడదు..

అలా చేస్తే మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మన మీద అస్సలు ఉండదు. డబ్బు లేదా డబ్బుకి సంబంధించిన ఏ వస్తువుని కూడా తలకింద పెట్టుకుని పడుకోకూడదు. దీని వలన మీకు విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే ధనలక్ష్మి మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. డబ్బుకి తగిన విలువ స్థానం మనం ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మన దగ్గర డబ్బు నిలవదు.. ఇక పడుకునే ముందు మన దగ్గర ఎటువంటి ధూమపానం లేదా మద్యపానం కి సంబంధించినవి పెట్టుకోకూడదు. లేదా బెడ్ రూమ్లో అశ్లీల చిత్రాలు ఉంచకూడదు. బెడ్ రూమ్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేస్తే మీరు సుఖంగా నిద్రపోతారు. అంతేకాదు రోజు పడుకునే ముందు కర్పూరం వెలిగించి పడుకుంటే ఇంకా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడింది.

రోజు రాత్రి బయట నుంచి వచ్చాక కాళ్ళను శుభ్రంగా కడిగి ఇంటి లోపలికి వెళ్ళాలి. చెప్పులను బయట వదిలేయాలి. లేకపోతే చెడు ఆత్మలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మీరు ఇవన్నీ పాటించినట్లయితే మీ ఇంట్లో కూడా చాలా మంచి జరుగుతుంది.. మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. ధనవంతులు అవుతారు…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక