Sleeping Tips : రాత్రి భోజనం తర్వాత ఇలా చేస్తే నిద్రలేమి సమస్యకి చెక్ పెట్టవచ్చు..!!
Sleeping Tips : చాలామంది రాత్రి సమయంలో సరియైన నిద్ర పట్టక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనిషికి నిద్ర చాలా ముఖ్యం. రాత్రి సమయంలో సరియైన నిద్ర పోకపోతే మన శరీరం ఎంతో అలసిపోతుంది. మరుసటి రోజు పగలంతా పరధ్యానంలో ఉంటారు. ఏ పని సరిగా చేయలేరు… మన ఆరోగ్యంలో నిద్ర అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. సరియైన నిద్ర లేకపోవడం వలన శరీరం పనితీరు దెబ్బతింటుంది. ప్రతి మనిషి రాత్రి సమయం 8:00 ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. నిద్ర సరిగా ఉంటేనే శరీరం విశ్రాంతి పొంది తిరిగి శక్తిని పెరిగేలా చేస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోజంతా కాఫీ, టీ లు తాగేవాళ్లు స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లు రాత్రి సమయంలో ఎక్కువగా తినే వాళ్ళు హాయిగా నిద్ర పోలేకపోతున్నారు.
రాత్రి సమయం లో భోజనం తర్వాత ఈ విధంగా చేస్తే ప్రశాంతమైన నిద్ర పడుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆయుర్వేద డాక్టర్ వరలక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో నిద్రను ప్రోత్సహించే జీర్ణక్రియను మెరుగుపరిచే కొన్ని చిట్కాలు గురించి ఆమె తెలియజేయడం జరిగింది. నిత్యం వాటిని పాటిస్తే జీర్ణ క్రియ సమస్యలు నిద్రలేమికి దూరంగా ఉండవచ్చు అని చెప్పారు.
అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం : కళ్ళపై చేతులు పెట్టుకోవాలి : ఆయుర్వేదంలో తేజోమయ అగ్ని మూలకమైన రాత్రి భోజనం తర్వాత చల్లని చేతులతో కళ్ళను తాకాలని డాక్టర్ వరలక్ష్మి తెలియజేశారు. ఈ విధంగా చేయడం వలన నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.
అదేవిధంగా కళ్ళు కూడా రిలాక్స్ అవుతాయి.. సోంపు తినాలి : సోంపు తీసుకోవడం వలన నోటి దుర్వాసన దూరం అవడంతోపాటు ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి. సోంపు గింజలలో అనుతోల్ పెంచున్ ఎక్స్ట్రాగోల్ ఉంటాయి. ఇవి యాంటీ స్పోడిక్ యాంటీ ఇన్ఫ్లమేటరిగా ఉపయోగపడతాయి. భోజనం చేసిన తర్వాత సోంప్ తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొన్ని జాగ్రత్తలు వహించాలి : పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవద్దు.. నిద్రపోయే ముందు ముఖ్యంగా త్వరగా జీర్ణం కాని ఆహార పదార్థాలు తీసుకోవద్దు. వీటి వలన జీర్ణ సమస్యలు వస్తే రాత్రి మేల్కోవాల్సి వస్తుంది. కొంతమంది నిద్ర పట్టడం లేదని ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన అన్ని మర్చిపోయి నిద్రపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ విధంగా చేయడం వలన సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది.
నిద్రపోయే ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. నిద్ర పోయేముందు టీ, కాఫీలు తీసుకోవద్దు. ఈ విధంగా చేయడం వలన నిద్ర భంగం కలుగుతుంది. రోజు ఒకే టయానికి నిద్రపోవడం లేవడం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన హ్యాపీగా నిద్ర పడుతుంది.. రాత్రి భోజనం తర్వాత కొంత సమయం నడవాలి : చాలామంది భోజనం చేసిన వెంటనే పడుకోవడం కూర్చుని టీవీ ఫోన్ చూసి అలవాట్లు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి సమయంలో భోజనం తర్వాత కొంతసేపు నడవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వలన మెటబాలిజం పెరగడంతో పాటు ఆహారం జీర్ణ ప్రక్రియ కూడా వేగవంతమవుతూ ఉంటుంది. భోజనం తర్వాత 100 అడుగులు నెమ్మదిగా నడవాలని నిపుణులు చెప్తున్నారు..