Diabetic Patients : షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి భయం లేకుండా మామిడి పండు తినొచ్చు… ఎలాగంటే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetic Patients : షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి భయం లేకుండా మామిడి పండు తినొచ్చు… ఎలాగంటే…!!

Diabetic Patients : ప్రస్తుతం మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వలన ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నము. ఈ సమస్యలలో ఒకటి షుగర్. షుగర్ ఉన్న పేషెంట్లు మామిడి పండ్లు తినకూడదు అనే భావనతో ఉంటారు. కానీ షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి భయాలు లేకుండా మామిడి పండ్లను తినొచ్చు. ఈ హ్యక్స్ తో మీ షుగర్ లెవెల్స్ పెరగకుండా కూడా ఉంటాయంట. అయితే కొన్ని చిట్కాలను జాగ్రత్తగా ఫాలో అయితే చాలు. షుగర్ పేషెంట్ కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2024,7:00 am

Diabetic Patients : ప్రస్తుతం మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వలన ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నము. ఈ సమస్యలలో ఒకటి షుగర్. షుగర్ ఉన్న పేషెంట్లు మామిడి పండ్లు తినకూడదు అనే భావనతో ఉంటారు. కానీ షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి భయాలు లేకుండా మామిడి పండ్లను తినొచ్చు. ఈ హ్యక్స్ తో మీ షుగర్ లెవెల్స్ పెరగకుండా కూడా ఉంటాయంట. అయితే కొన్ని చిట్కాలను జాగ్రత్తగా ఫాలో అయితే చాలు. షుగర్ పేషెంట్ కూడా ఎలాంటి భయాలు లేకుండా మామిడి పండ్లను తీసుకోవచ్చు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం… మన భారతీయులు ఆహార ప్రియులు. సీజనల్ ఫ్రూట్స్ ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సమ్మర్ సీజన్ లో మామిడిపండు అంటే జనాలు లొట్టలేసుకుంటూ తింటారు.

మ్యాంగో లవర్స్ ఎండాకాలంలో కూల్ కూల్ గా మామిడి పండ్లను లాగిస్తూ ఉంటారు. కానీ షుగర్ పేషెంట్స్ కు తినాలని ఎంతో కోరికగా ఉన్నా కానీ తినలేరు. ఎందుకు అంటే. మామిడి తింటే వారిలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. అదిమరింత ప్రమాదానికి కూడా దారితీస్తుంది అని భయపడతారు. అయితే ఈ హ్యక్స్ తో మామిడిపండు తింటే షుగర్ లెవెల్స్ పెరగకుండా కూడా ఉంటాయి అంట… డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండ్లను తీసుకునేటప్పుడు ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక మీడియం మామిడి పండులో 50 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. కావున రోజులో ఒకటి లేక సగం మామిడి పండు మాత్రమే తీసుకుంటే షుగర్ స్పెక్ ఉండవు అని నిపుణులు అంటున్నారు. తినాలి అనే ఆత్రతో ఎక్కువ తినకుండా కాస్త కంట్రోల్ లో తింటే ఈ సమ్మర్ లో మ్యాంగో ని మీరు కూడా ఆస్వాదించవచ్చు.

మీరు మామిడిని ఎప్పుడు తిన్నారో అందులో హెల్తీ ఫ్యాట్స్ మరియు ఫైబర్ కలిపి తినాలి అని నిపుణులు అంటున్నారు. మామిడి పండు తినే ముందు చియా గింజలతో ఒక కప్పు నిమ్మకాయ నీరు త్రాగాలి లేక మామిడి తినటానికి ముందు నానబెట్టిన బాదం లేక వాల్ నట్స్ లను తీసుకోవడం మంచిది. ఇది ఆకస్మిక గ్లూకోజ్ స్పెక్ లను తగ్గిస్తుంది. మ్యాంగో తినాలి అంటే. ఇతర ఫ్రూట్స్ తో దానిని బ్యాలెన్స్ చేయటం చాలా ముఖ్యం అనే విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మామిడి పండు తినే ముందు నడక లేదా వ్యాయామం చేయడం చాలా మంచిది. ఇది చక్కెర స్థాయి నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు మామిడిని చిన్నప్పుడు దానిని పండులా తినండి. మామిడి షేక్ లేక జ్యూస్ లా త్రాగవద్దు. ఎందుకు అంటే. దీనిలో చక్కెర చాలా ఉంటుంది. కావున అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. మీరు మామిడిని తీసుకుంటే దానితో పాటు ఇతర అధిక కార్బ్ ఆహార పదార్థాలను తీసుకోవటం మంచిది. మామిడి పండు తినాలి అంటే. ఇతర కార్బ్ ని కచ్చితంగా కట్ చేయాల్సిందే. లేకపోతే మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కావున ఆ జాగ్రత్త చాలా ముఖ్యం…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది