Sweet Potato : ‘‘చిలగడ దుంప’’ తెగ.. దీన్ని తింటే ఇన్ని లాభాలున్నాయా?
Sweet Potato : చిలగడ దుంపలను ఇంగ్లిష్ లో ‘స్వీట్ పొటాటో’ అంటారు. తెలుగులో ‘తియ్యటి ఆలుగడ్డ’ అనొచ్చు. కొన్ని ప్రాంతాల్లో వీటిని గనుసు గడ్డలు అని కూడా అంటారు. ఇవి తెలుపు, నారింజ, ఊదా రంగుల్లో ఉంటాయి. తినటానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కొనాలంటే తక్కువ రేటుకే దొరుకుతాయి. చిలగడ దుంపలను పచ్చివి తినొచ్చు. ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. కాకపోతే పచ్చి గడ్డలను తినాలంటే ముందుగా శుభ్రం చేసుకోవాలి. వాటికి అంటిన మట్టిని కడగాలి. ఉడకబెడితే పొట్టు ఊడిపోతుంది. అయితే ఆ పొట్టును తీసి పారేయకుండా తినాలి. అప్పుడే వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి.

sweet-potato-sweet-potato-is-all-in-one-for-health
ఏమేం ఉంటాయ్?..
గనుసు గడ్డల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, మంచి కొవ్వు పదార్థాలు; ఏ, సీ, బీ6 విటమిన్లు లభిస్తాయి. పొటాషియం, పాంటోథెనిక్ ఆమ్లం, కాపర్, నియాసిన్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తాయి. తద్వారా మనం వ్యాధులకు దూరంగా, ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడతాయి. ఇన్ని పోషకాలు ఒకే పదార్థంలో దొరకటం చాలా అరుదు. అందుకే ఈ గనుసు గడ్డలు క్యాన్సర్ కణాల పెరుగుదలను సైతం సమర్థవంతంగా తట్టుకోగలవని పరిశోధనల్లో తేలింది. చిలగడ దుంపలను తింటే కంటికి కూడా మంచిదే. చూపు మందగించదు. మెదడులో వేడి తగ్గుతుంది. తద్వారా కూల్ అవుతాం. మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండేలా స్వీట్ పొటాటో ఉపయోగపడుతుంది. దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చిలగడ దుంపలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

sweet-potato-sweet-potato-is-all-in-one-for-health
రకరకాలుగా..: Sweet Potato
గనుసు గడ్డలను ఉడకబెట్టే ముందు నీళ్లల్లో కొంచెం ఉప్పు వేస్తే తినటానికి ఇంకా బాగుంటాయి. స్వీట్ పొటాటోతో వంటలు కూడా చేయొచ్చు. ముఖ్యంగా వేపుళ్లు చేసుకుంటే చారుతో అన్నం తినేటప్పుడు నంజుకోవచ్చు. ఉదయం, సాయంత్రం టైమ్ పాస్ కి స్నాక్స్ లాగా తినొచ్చు. చిలగడ దుంపలు వానా కాలంలో మార్కెట్ లోకి వస్తాయి. వివిధ రంగుల్లో దొరుకుతాయి. కానీ అన్నింటి కన్నా ఆరెంజ్ కలర్ స్వీట్ పొటాటో కంటి ఆరోగ్యానికి మంచిది. గనుసు గడ్డలు తింటే ఆకలి అనిపించదు. తద్వారా తక్కువ అన్నం తింటాం. ఫలితంగా బరువు తగ్గుతాం. చిలగడ దుంపలను తిన్నవాళ్ల ఒంట్లోని కొవ్వు కరుగుతుంది. సెంట్రల్ అమెరికాలో పుట్టిన ఈ స్వీట్ పొటాటో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. షుగర్ పేషెంట్లూ స్వీట్ పొటాటో తినొచ్చు. కాబట్టి గనుసు గడ్డలను ఆరోగ్యానికి సంబంధించిన ‘‘ఆల్ ఇన్ వన్’’ అని అభివర్ణించొచ్చు.

sweet-potato-sweet-potato-is-all-in-one-for-health