Sweet Potatoes : చామదుంపలతో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఆ రోగాలన్నీ దూరం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sweet Potatoes : చామదుంపలతో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఆ రోగాలన్నీ దూరం..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 May 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Sweet Potatoes : చామదుంపలతో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఆ రోగాలన్నీ దూరం..!

Sweet Potatoes : ఆరోగ్యంగా ఉండేందుకు ఏవి తినాలో తెలుసుకోవడం చాలా ఉత్తమం. ఏ కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకోవాలి. కాగా చామ దుంపల గురించి చాలా మందికి తెలియదు. వాటిని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే చామదుంపల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి 6, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే వీటితో ఆరోగ్యంతో పాటు రుచి కూడా బాగానే ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తినడానికి ఇష్టపడుతారు. కాగా దాంతో ఇంకా చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Sweet Potatoes గుండె ఆరోగ్యానికి..

గుండె ఆరోగ్యానికి చామ దుంపలు ఎంతో బాగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో కొలెస్ట్రాల్ ను కరిగించడంలో అద్భుతంగా సాయం చేస్తుంది. పైగా ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యానికి బాగానే సాయం చేస్తుంది.

Sweet Potatoes బరువు తగ్గడంలో..

ఊబకాయంతో బాధపడేవారు చామదుంపలు తీసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. పైగా దీన్ని వేసవిలో తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు బాగానే తగ్గుతాయి. ఇది తింటే ఎక్కువ సేపు ఆకలి కాదు. దాని వల్ల బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. దీని ప్రభావం బరువును తగ్గించడంలో బాగానే కనిపిస్తుంది. కాబట్టి ఇది బరువు తగ్గేందుకు చాలా బెటర్.

Sweet Potatoes కళ్లకు మేలు చేస్తుంది..

బీటా-కెరోటిన్, క్రిప్టోక్సాంటిన్ లాంటి యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల మన కండ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక ఎంజైమ్స్ కంటి రెటీనా దెబ్బతినకుండా కాపాడుతాయి. అంతే కాకుండా కంటిలో ఉండే శుక్లం కూడా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా పని చేస్తుంది.

Sweet Potatoes చామదుంపలతో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు ఆ రోగాలన్నీ దూరం

Sweet Potatoes : చామదుంపలతో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఆ రోగాలన్నీ దూరం..!

Sweet Potatoes ఎముకలకు మేలు..

ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో చామ దుంపలు సాయం చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఇవి ఎముకలు ధృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సాయం చేస్తాయి. క్యాన్సర్ లాంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

Sweet Potatoes ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో..

చామదుంపల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. సీజన్‌తో పాటు పెరిగే ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో కూడా బాగానే సాయం చేస్తుంది. పైగా ఇందులో సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది