Blood Sugar : ఈ లక్షణాలు కనిపిస్తే రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నట్లే… జాగ్రత్త పడకపోతే ఇక అంతే…!
Blood Sugar : ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీపి పదార్థాలు తినకూడదని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ మన శరీరానికి చక్కెర కూడా చాలా ముఖ్యమైనదని నిపుణులు అంటున్నారు. గ్లూకోస్ సాధారణ స్థాయి డెసిమీటర్కు 80-110mg మధ్య ఉండాలని నిపుణులు అంటున్నారు. శరీరంలో చక్కెర స్థాయి మీటర్ కు 72 mg కంటే తక్కువగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయి తక్కువ ఉన్నట్లు. ఈ పరిస్థితిని హైపో గ్లైసిమియా అంటారు. చక్కెర వ్యాధి వచ్చినవారు షుగర్ స్థాయి పడిపోవడాన్ని గమనించలేరు. అయితే చక్కెర వ్యాధి బాధితులకు శరీరంలో షుగర్ స్థాయి తక్కువగా ఉన్న అనేక వ్యాధులు వస్తాయి.
మనం తీసుకున్న ఆహారం రక్తంలో గ్లూకోస్ కరిగిపోతుంది. ఇక్కడి నుంచి అది శరీరంలో కణాలకు చేరుతుంది. కణాలకు శక్తి కోసం ఉపయోగించడంలో సహాయపడుతుంది. కొన్ని కారణాల వలన ఆకలితో ఉన్న వ్యక్తులు లేదా సగటు కంటే తక్కువ ఆహారం తినే వ్యక్తులు తక్కువ రక్త చక్కెర బాధితులుగా మారవచ్చని పేర్కొన్నారు. రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నవారిలో కంటిచూపు మసకగా కనిపించడం వేగవంతమైన హృదయ స్పందన, తల తిరుగుతున్నట్లు అనిపించడం, చేతులు కాళ్లలో వణుకు, ఆందోళన చర్మం పసుపు రంగులోకి మారడం, తలనొప్పి, నీరసం, నిద్ర పట్టకపోవడం, ఆకలి పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే డయాబెటిక్ పేషెంట్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చక్కెర కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో కనీసం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండాలి. రోజు ఆహారంలో డ్రై ఫ్రూట్స్, జ్యూసులు లేదా మాంసాహారాన్ని కూడా తీసుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ముందుగా అల్పాహారం తీసుకున్న తర్వాతనే వెళ్లాలి. కళ్ళు తిరగటం అనిపిస్తే వెంటనే తీపి పదార్థాలను తినాలి. రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. సరైనా ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి సరిపడా ఉంటుంది.