Joint pains : వీటిని అర గ్లాసుతీసుకుంటే కీళ్ల నొప్పులును తగ్గించుకోవచ్చు…!!
Joint pains : చాలామంది కీళ్ల నొప్పులతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొద్ది దూరం నడిస్తే నొప్పులు తీవ్రత పెరిగి అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఎముకల మధ్య గుజ్జు కీళ్ల మధ్య అరిగి శబ్దం వస్తు నొప్పులు ఎక్కువ అవ్వడం వలన నడవడానికి చాలా ఇబ్బందిగా మారుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పులు తగ్గించడానికి ఎముకల మధ్య గుజ్జు పెరగడానికి చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి.. రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ కలోంజి గింజలను వేసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి.
మర్నాడు ఉదయం ఈ నానిన కలోంజి గింజలు నీటిని కలిపి పొయ్యి మీద పెట్టి ఐదు నిమిషాలు పాటు బాగా ఉడికించుకోవాలి. ఆ తదుపరి చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించి బాగా ఉడికిన ఈ నీటిని ఒక గ్లాసులోకి వడకట్టి ఉదయం పూట ఆ వాటర్ ని తీసుకోవాలి. ఈ కలోంజి నీటిని తీసుకోవడం వలన మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే కీళ్ల మధ్య గుజ్జు కూడా పెరుగుతుంది. అలా పెరగడం వలన శబ్దం కూడా రాదు. అలాగే నరాల బలహీనత ఉన్నవాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
ఇప్పుడున్న పరిస్థితులు శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ నీటిని 15 రోజులు తాగినట్లయితే దీని ఫలితం మీకే అర్థమవుతుంది. కావున ఇంకా ఎన్ని రోజులు తాగాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కాస్త ఓపిక తీసుకున్నట్లయితే ఇంటి రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి కండరాలు బలంగా మారతాయి… అలాగే ఈ కలోంజి నీటిని తాగడం వలన ఇంకా ఎన్నో రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చు…