Joint Pains : ఈ సీజన్ లో వచ్చే కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం పొందాలంటే… ఈ టిప్స్ ఫాలో అవ్వండి…??
ప్రధానాంశాలు:
Joint Pains : ఈ సీజన్ లో వచ్చే కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం పొందాలంటే... ఈ టిప్స్ ఫాలో అవ్వండి...??
Joint Pains : చలికాలం వచ్చింది అంటే చాలు ఎన్నో రకాల సమస్యలు వచ్చి పడతాయి. ఈ సీజన్ లో ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అందులోనూ ప్రస్తుతం చలి తీవ్రత అనేది బాగా పెరిగిపోయింది. అలాగే చలి తీవ్రత అనేది రికార్డు స్థాయిలో నమోదవుతుంది. ఈ తరుణంలోనే ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఈ సీజన్ లో వచ్చే జలుబు మరియు దగ్గు, జ్వరం లాంటి సమస్యలతో పాటు కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. అయితే వాతావరణం లో ఉష్ణోగ్రతలు అనేవి పడిపోవడం వలన శరీరంలో కండరాలు అనేవి బిగిసుకొని పోతాయి. దీంతో కీళ్ళ నొప్పులు అనేవి వస్తాయి…
కీళ్లు అనేవి గట్టిపడటం వలన నడవడానికి కూడా వీలుకాదు. అయితే ఈ సమస్య నుండి బయట పడాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. మీకు వీలైనంతవరకు ఎండ ఇంటిలో పడేలా చూసుకోవాలి. దీని వలన ఇంట్లో చల్లధనం అనేది తగ్గిపోయి వేడి అనేది పెరుగుతుంది. అలాగే ఉదయం మరియు సాయంత్రం వేళలో ఎండ శరీరం పై పడేలా చూసుకోవాలి. అంతేకాక చలికాలంలో కాస్త వేడిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి…
ఈ కాలంలో సూప్ లాంటివి తీసుకోవడం వలన కండరాలు రిలీఫ్ అవుతాయి. అలాగే సల్ఫర్ మరియు కాల్షియం ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి. అంతేకాక నీటిని కూడా అధికంగా తాగుతూ ఉండాలి. దీనివలన కండరాలనేవి ఫ్రీగా ఉంటాయి. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గటం వలన కూడా కీళ్లనొప్పులు అనేవి వస్తాయి. ఒకవేళ మీకు జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి