Throat Pain : గొంతు నొప్పి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి… ఇది కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు సంకేతం…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Throat Pain : గొంతు నొప్పి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి… ఇది కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు సంకేతం…??

Throat Pain : ఈ రోజుల్లో గొంతు నొప్పి అనేది సర్వసాధారణమైన విషయం. కాస్త వాతావరణం లో మార్పు వచ్చిన లేక తాగే నీరు మారిన వెంటనే గొంతు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అయితే గొంతు నొప్పికి జలుబు మరియు దగ్గు మొదలు ఎన్నో రకాల కారణాలు కూడా ఉంటాయి అని నిపుణులు అంటున్నారు. కానీ కొన్ని సందర్భాలలో గొంతు నొప్పి ని అస్సలు లైట్ తీసుకోకూడదు అని అంటున్నారు నిపుణులు. అలాగే మీరు దీర్ఘకాలంగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 November 2024,2:55 pm

ప్రధానాంశాలు:

  •  Throat Pain : గొంతు నొప్పి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి... ఇది కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు సంకేతం...??

Throat Pain : ఈ రోజుల్లో గొంతు నొప్పి అనేది సర్వసాధారణమైన విషయం. కాస్త వాతావరణం లో మార్పు వచ్చిన లేక తాగే నీరు మారిన వెంటనే గొంతు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అయితే గొంతు నొప్పికి జలుబు మరియు దగ్గు మొదలు ఎన్నో రకాల కారణాలు కూడా ఉంటాయి అని నిపుణులు అంటున్నారు. కానీ కొన్ని సందర్భాలలో గొంతు నొప్పి ని అస్సలు లైట్ తీసుకోకూడదు అని అంటున్నారు నిపుణులు. అలాగే మీరు దీర్ఘకాలంగా గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి అని అంటున్నారు. అంతేకాక ఎక్కువ కాలం పాటు గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతుంటే అది తీవ్ర సమస్యకు సంకేతం గా భావించాలి అని అంటున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

– గొంతు నొప్పి రావడానికి ముఖ్య కారణాలలో బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్ ఒక కారణం అని అంటున్నారు నిపుణులు. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిర్లక్ష్యం చేస్తే రుమాటిక్ ఫీవర్ మరియు కిడ్నీ వాపు, కిడ్నీలో చీము లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఎక్కువ కాలం పాటు గొంతు సమస్య గనక ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి అని అంటున్నారు నిపుణులు…

– గొంతు నొప్పి అధిక కాలం ఉంటే అది క్యాన్సర్ కు లక్షణం అని భావించాలి అంటున్నారు నిపుణులు. సాధారణంగా గొంతు క్యాన్సర్ స్వర పేటిక మరియు ఫారింక్స్ లేదా ట్యాన్సిల్స్ నుండి మొదలవుతుంది. ఇటువంటి టైం లో నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి అని అంటున్నారు…

– తీవ్రమైన అలర్జీల కారణం చేత కూడా గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చెప్పాలంటే దుమ్ము మరియు మట్టి లేక పలు రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కూడా అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి అని అంటున్నారు…

– ఇకపోతే యాసిడ్ రిప్లెక్స్ లేక గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిప్లెక్స్ లాంటి వ్యాధులు కారణంగా కూడా గొంతులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది దీర్ఘకాలంగా కడుపులో యాసిడ్ కారణంగా గొంతు నొప్పికి కారణం అవుతుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే ఆటో ఇమ్యున్ వ్యాధులలో ఇది తరచుగా నొప్పిని కూడా కలిగిస్తుంది అని అంటున్నారు. అలాగే గొంతు నొప్పి నుండి బయట పడాలి అంటే జీవన శైలిలో కొన్ని మార్పులు కచ్చితంగా తీసుకొవాలి అని అంటున్నారు.

Throat Pain గొంతు నొప్పి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఇది కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు సంకేతం

Throat Pain : గొంతు నొప్పి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి… ఇది కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు సంకేతం…??

– గొంతు నొప్పి సమస్య నుండి బయటపడాలి అంటే కొన్ని సహజ చిట్కాలను కూడా పాటించాలి అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తేనె మరియు అల్లం లాంటి వాటిని తీసుకోవాలి అని అంటున్నారు. వీటితో పాటుగా మిరియాల టీ తాగటం లాంటి వాటి వలన కూడా గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అని అంటున్నారు నిపుణులు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది