Throat Pain : ప్రతిరోజు జలుబు, గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నారా… జాగ్రత్త… ఇది క్యాన్సర్ కు సంకేతం కావచ్చు…!
ప్రధానాంశాలు:
Throat Pain : ప్రతిరోజు జలుబు, గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నారా... జాగ్రత్త... ఇది క్యాన్సర్ కు సంకేతం కావచ్చు...!
Throat Pain : ప్రస్తుత కాలంలో ఎన్నో రోగాలతో ఎంతోమంది సతమతమవుతున్నారు. అయితే నయం చేయలేని రోగం అంటే క్యాన్సర్ అని చెప్పవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చూసినట్లయితే,మన దేశంలో కూడా క్యాన్సర్ రోగాల సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. అయితే 2019 భారతదేశంలో దాదాపు 1.2 మిలియన్ల మంది ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. దాని లో 9.3 లక్షల మంది క్యాన్సర్ తో మరణించారు. ఆ సంవత్సరం ఆసియాలో క్యాన్సర్ మరణాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అలాగే భారత దేశంలో దాదాపుగా 32 రకాల క్యాన్సర్ బారిన పడి కొన్ని లక్షల మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాటిలో ఒకటి అన్నవాహిక క్యాన్సర్ కూడా. అయితే మన దేశంలో ప్రతి ఏటా 47 వేలమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు అని 42,వేల మంది మరణిస్తున్నారు అని పరిశోధనలు తెలిపాయి. ప్రస్తుతం ఈ వ్యాధితో ఎంతో మంది పోరాడుతున్నారు.
ఈ క్యాన్సర్లలో అన్నవాహిక క్యాన్సర్ చాలా అరుదైనది మరియు ఎంతో ప్రమాదకరమైనది కూడా. సాధారణంగా నోరు మరియు గొంతు అన్నవాహికాలో ఏర్పడే ఫ్యూయల్ ట్యూమర్లు అనేవి కాన్సర్ గా ఏర్పడతాయి. అయితే వీటిని ముందుగానే అర్థం చేసుకోవడానికి ఎలాంటి మార్గం లేనప్పటికీ గమనించవలసిన కొన్ని సాధారణ లక్షణాలు మాత్రం ఉన్నాయి అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం…
ఈ వ్యాధి వచ్చిన మొదటి దశలో అన్నం మింగటం ఎంతో కష్టం అవుతుంది. అలాగే ద్రవ ఆహారాన్ని తినడం మరియు మింగటం కూడా ఎంతో కష్టమవుతుంది. అలాగే జలుబు చేసిన గొంతు నొప్పిగా ఉంటుంది. అయితే ఎంతో మంది ఈ లక్షణాలను సాధారణ జలుబుగా భావించి దానిని అసలు పట్టించుకోరు. కానీ ఇది కూడా క్యాన్సర్ కు సంకేతమే. ఈ వ్యాధి అనేది శరీరంలో వెళ్లాలి అనుకున్నప్పుడు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అలాగే ఛాతిలో మంట మరియు నిత్యం త్రేనుపు, కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే హఠాత్తుగా బరువు కూడా తగ్గవచ్చు. ఈ వ్యాధి యొక్క లక్షణం ఆహారంపై విరక్తి కలిగించడం. అలాగే మరొక లక్షణం దీర్ఘకాలంగా దగ్గు అనేది రావడం. అలాగే రాత్రి పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు మరియు ఛాతి మధ్యలో నొప్పి అనేది ఏర్పడుతుంది…
ముఖ్యంగా ఆహారాన్ని తినడం ఎంతో కష్టంగా ఉంటుంది. ఇలాంటి టైంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వెంటనే వైద్యుల సలహాలు తీసుకోవాలి. అలాగే వికారం, అలసట, బలహీనత, తినేటప్పుడు ఒక్కరి బిక్కిరి కావటం కూడా ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణమే. ఈ రకమైన క్యాన్సర్ కారణంగా నిత్యం మలబద్ధకం లేక అతిసారంతో ఇబ్బంది పడతారు. అలాగే మీ వాయిస్ టోన్ ని కూడా మారుస్తుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధి ఇప్పటివరకు వ్యాక్సిన్ ను కనుక్కోలేదు. కావున మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. అంతేకాక ఊబకాయ సమస్య వలన కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. అయితే అతిగా వేడి టీ మరియు కాఫీలు తాగడం కూడా మంచిది కాదు…