Throat Pain : గొంతు నొప్పితో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించుకోండి …!
ప్రధానాంశాలు:
Throat Pain : గొంతు నొప్పితో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించుకోండి ...!
Throat Pain : వాతావరణం కాస్త మారిన లేదా చల్లటి నీరు త్రాగిన గొంతు నొప్పి సమస్య వస్తుంది. కొన్ని సందర్భాలలో గొంతు నొప్పికి ఇన్ఫెక్షన్ కూడా కారణం అవుతుంది. గొంతు బొంగురు పోవడం లేదా వాచినట్లు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. తీసుకొని ఆహారాన్ని మింగటం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అయితే గొంతు ఇన్ఫెక్షన్ వస్తే వైద్యుడిని సంప్రదించే కంటే ముందు ఇంట్లోనే కొన్ని సింపుల్ రెమెడీస్ ద్వారా గొంతు నొప్పి నుంచి బయటపడవచ్చు. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఉప్పు నీరు బెస్ట్ రెమిడీ అని చెప్పవచ్చు. ఉప్పు నీటిని పుకిలించి చేయడం వలన ఇన్ఫెక్షన్ త్వరగా నయం అవుతుంది. ఉప్పులోని యాంటీ బ్యాక్టీరియల్ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
అలాగే గొంతు నొప్పితో బాధపడేవారు పాలలో పసుపు కలుపుకొని త్రాగటం వలన మేలు జరుగుతుందని వైద్యులు అంటున్నారు. పాలలో పసుపు కలుపుకొని త్రాగటం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు. పసుపు పాలు తీసుకోవడం వలన గొంతు ఇన్ఫెక్షన్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. అలాగే నీళ్లలో పసుపు వేసి కాసేపు మరిగించిన తర్వాత పుక్కిలించి ఉంచిన మంచి ఫలితం ఉంటుంది. రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేస్తే గొంతు వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గొంతు నొప్పితో బాధపడే వారికి చామంతి పూలతో చేసిన టీ త్రాగటం వలన మంచి ఉపశమనం దొరుకుతుంది. చామంతి పూలతో చేసిన టీలో యాంటీ ఇన్ఫ్లోమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మేలు చేస్తాయి.
ఇవి కళ్ళు, ముక్కు, గొంతు వాపు నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడతాయి. అలాగే గొంతు నొప్పితో బాధపడేవారు ఆవిరి తీసుకోవడం మంచి టెక్నిక్ అని చెప్పవచ్చు. వేడి నీటిలో పసుపు వేసుకొని ఆవిరి పట్టడం వలన గొంతు సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే గొంతు నొప్పి ని తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. తేనే గొంతు నొప్పి, చికాకు తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. ఒక స్పూను అల్లం రసం ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే శ్వాసనాళాలలో పేరుకున్న శ్లేష్మాన్ని తేనె కరిగిస్తుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ రెమెడీస్ తో గొంతు నొప్పి ని తగ్గించుకోవచ్చు.