Hair : జుట్టు విపరీతంగా ఊడిపోవడానికి అస్సలు కారణం ఏమిటో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Hair : జుట్టు విపరీతంగా ఊడిపోవడానికి అస్సలు కారణం ఏమిటో తెలుసా...!!
Hair : ప్రస్తుత కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ జుట్టు పొడుగ్గా మరియు ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న జుట్టు ఉడిపోకుండా ఉండటం కోసం ఎన్నో కష్టాలు కూడా పడుతూ ఉన్నారు. దీనికోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. అయితే జుట్టు బాగా పెరగాలి అని షాంపూలు మరియు ఇతర రకాల నూనె లను ఎక్కువగా వాడుతూ ఉంటారు.
అయితే జుట్టును దువ్వే విధానం వలన కూడా జుట్టు అనేది విపరీతంగా రాలిపోతుంది అని మరియు పెరుగుదల నిలిచిపోవడానికి కారణం అవుతుంది అని మీకు తెలుసా. అయితే మీరు జుట్టు ను దువ్వేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆ పొరపాట్లు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జుట్టు ను ఎంతోమంది పదేపదే దువ్వుతూ ఉంటారు. అలాగే జుట్టును ఎక్కువ సార్లుగా దువ్వటం కూడా అంత మంచిది కాదు. ఇలా చేయటం వలన హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యి తొందరగా జుట్టు అనేది రాలిపోతుంది. అలాగే కుదుళ్ళ మీద కూడా ఒత్తిడి అనేది పెరుగుతుంది.
అలాగే ఈ కొంతమంది తడి జుట్టు మీద అధిక సార్లు దువ్వుతూ ఉంటారు. ఇలా దువ్వినా కూడా జుట్టు ములాలనేవి బలహీనంగా మారతాయి. అలాగే ఇది జుట్టును బలహీనంగా మార్చేస్తుంది. కావున తల తడిగా ఉన్నప్పుడు జుట్టును దువ్వటం అంతా మంచిది కాదు. అంతేకాక కొంతమంది దువ్వెనను కూడా శుభ్రం చేయకుండా జుట్టు ను దువ్వుతూ ఉంటారు. అయితే దువ్వెనను ఎప్పుటి కప్పుడు మట్టి లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే చుండు సమస్య అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీ జుట్టుని ఎప్పుడైనా సరే విభజించుకొని చిక్కులు తీసుకుంటే చాలా మంచిది. దీని వలన చిక్కులు అనేవి తొందరగా మరియు ఈజీగా వస్తాయి…