Seeds : నిత్యం ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Seeds : నిత్యం ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :23 August 2024,6:00 am

Seeds : వంటిల్లే వైద్యశాల అని ఊరికే అనలేదు మన పెద్దవాళ్లు. అయితే మన వంట గదిలో నిత్యం వాడుకునే వాటితోనే ఎన్నో రకాల జబ్బులు మరియు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వాటిలలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు లాంటి వాటిని నానపెట్టుకొని నిత్యం తీసుకోవడం వలన ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెంతులు అనేవి మన ఆరోగ్యాన్ని మరియు అందాన్ని పెంచడంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని నీటిలో నానబెట్టుకొని తీసుకోవటం వలన జీర్ణ సమస్యలు మరియు చర్మ, జుట్టు సమస్యలను కూడా నియంత్రిస్తుంది.

అలాగే జీలకర్ర కూడా నానబెట్టి తీసుకుంటే చాలా మంచిది. వీటిని ఇలా తీసుకోవడం వలన డయాబెటిస్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇవి మాత్రమే కాక ఎన్నో రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే వామును కూడా నానబెట్టి తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు అనేవి అనారోగ్య సమస్యలతో పోరాడగలదు. అలాగే సోంపు ను కూడా నానబెట్టి తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు మరియు చర్మ సమస్యలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Seeds నిత్యం ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Seeds : నిత్యం ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

తులసి విత్తనాలలో కూడా పోషకాలు అనేవి సమృద్ధిగా ఉన్నాయి. వీటిని కూడా నీటిలో కలిపి తీసుకోవడం వలన ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది ఎంతో బాగుంటుంది. అలాగే కలోంజి విత్తనాలను తీసుకోవడం వలన కణాల ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. వీటిని నానబెట్టుకుని తీసుకోవడం వలన వాపు లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే చియా సీడ్స్ లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కావున వీటిని నిత్యం తీసుకుంటే ఎన్నో సమస్యలను కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఆవాలను కూడా నీటిలో నానబెట్టి తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిలో ఒమేగా త్రీ,ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఆరోగ్యాన్ని పెంచే సమ్మేళనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది