Seeds : ఈ గింజలతో ఎనలేని ఆరోగ్య ప్రయోజనాలు… మరి ముఖ్యంగా వేసవిలో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Seeds : ఈ గింజలతో ఎనలేని ఆరోగ్య ప్రయోజనాలు… మరి ముఖ్యంగా వేసవిలో..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Seeds : ఈ గింజలతో ఎనలేని ఆరోగ్య ప్రయోజనాలు... మరి ముఖ్యంగా వేసవిలో..!

Seeds : ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలుల తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది. ఇంట్లో నుండి అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఇక ఎండ వేడి , ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంతేకాక రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప పగటిపూట ఇంటి నుంచి బయటకు రావద్దని వైద్యు నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని కాలాలలో మాదిరిగా వేసవికాలంలో ఏది పడితే అది తినకూడదని సూచిస్తున్నారు. అయితే వేసవికాలంలో శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి శరీరానికి నీతి శాతాన్ని అందించగలిగే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా వేసవికాలంలో కొన్ని రకాల విత్తనాలు తీసుకోవడం వలన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విత్తనాలు ఏంటి వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Seeds : గసగసాలు…

వేసవి కాలంలో గసగసాలు తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గసగసాలలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఐరన్ కాపర్ ఫైబర్ ప్రోటీన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి .కావున వేసవికాలంలో గసగసాలు తినడం వలన పొట్ట చల్లబడుతుంది. తద్వారా ఎస్డిటి , మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే బలహీనమైన ఎముకలతో బాధపడేవారు ఎక్కువగా మార్కెట్ లో లభించే మందులు పౌడర్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎముకల ఆరోగ్యానికి ఎక్కువగా మందులు తీసుకోవడం వలన శరీరానికి హాని కలిగే ప్రమాదం ఉంది. కావున బలహీనమైన ఎముకల సమస్యతో బాధపడేవారు ఇంట్లోనే హోమ్ రెమిడీని తయారు చేసుకుని తీసుకోవడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి.

Seeds ఈ గింజలతో ఎనలేని ఆరోగ్య ప్రయోజనాలు మరి ముఖ్యంగా వేసవిలో

Seeds : ఈ గింజలతో ఎనలేని ఆరోగ్య ప్రయోజనాలు… మరి ముఖ్యంగా వేసవిలో..!

Seeds : ఎముకల బలానికి రెమిడీ…

గసగసాలు అనేవి ఆహారానికి రుచిని అందించడంతోపాటు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాక ఇవి ఎముకలకు బలాన్ని చేకూర్చేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాక గసగసాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఈ గసగసాలు తీసుకోవడం వలన పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండి బరువును అదుపులో ఉంచుతుంది. అదేవిధంగా గసగసాలకు నొప్పి తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి వెన్న నొప్పి లేదా కీళ్ల నొప్పుల నుండి తక్షణమే ఉపశమనం కలిగించగలవు. అదేవిధంగా ఆందోళన తగ్గించడానికి గసగసాలు ఎంతగానో ప్రయోజనకరం.

ఈ విధంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి గసగసాలను ప్రతిరోజు పాలలో కలిపి తీసుకోవడం వలన ఎముకలు దృఢంగా మారి , చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది. మీరు ఈ గసగసాలను అనేక విధాలుగా తీసుకోవచ్చు. పాలలో కలిపి తీసుకోవచ్చు లేదా నీటిలో నానబెట్టి లస్సీ లేదా షర్బత్ లాగా తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఆరోగ్యకరమైనవి కదా అని పరిమితికి మించి తింటే ప్రమాదకరమే. ఎంత ఆరోగ్యకరమైనది అయినప్పటికీ తగినంత పరిమాణంలో తినడం అనేది ఉత్తమం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది