Sugarcane Juice : ఈ సమస్యలు ఉన్నవారు చెరుకు రసం అస్సలు తాగకూడదు… ఎందుకంటే..?
ప్రధానాంశాలు:
Sugarcane Juice : ఈ సమస్యలు ఉన్నవారు చెరుకు రసం అస్సలు తాగకూడదు... ఎందుకంటే..?
Sugarcane Juice : ప్రస్తుతం వేసవికాలం నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వేసవికాలం ప్రారంభం అయిన వెంటనే మార్కెట్లోకి రకరకాల జ్యూసులు శీతల పానీయాలు వస్తుంటాయి. ఇక దీనిలో నిమ్మరసం, మజ్జిగ ,పుదీనా వాటర్, చేరకు రసం విరివిగా అమ్ముతూ ఉంటారు. అయితే వీటిలో చెరకు రసం తాగడానికి రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుని కలుగజేస్తుంది. ఇక దీనిలో ఉండే కాల్షియం ,ఐరన్ ,జింక్, మెగ్నీషియం ,పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇది మన శరీరాన్ని చల్లబరిచి శరీరం డీ-హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అంతేకాక దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ క్రియ, ఎముకల ఆరోగ్యం, కిడ్నీల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న చెరుకు రసాన్ని అందరూ తాగలేరు. ఎందుకంటే చెరకు రసం తాగటం అనేది కొంతమందికి హాని కలుగజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
షుగర్ : మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరుకు రసం అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది అధిక గ్లైసిమిక్ లోడ్ కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలోని చక్కెర ప్రభావితం అవుతుంది. అదేవిధంగా చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
జీర్ణ సమస్యలు ఉన్నవారు : జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు చెరుకు రసం అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఉండే పోలీకోసనాల్ జీర్ణ వ్యవస్థ పై చెడు ప్రభావం చూపిస్తుంది.తద్వారా కడుపునొప్పి వాంతులు విరోచనాలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఊబకాయం సమస్య : చెరుకు రసం అధిక కేలరీల కంటెంట్ ను కలిగి ఉంటుంది కాబట్టి ఊబకాయంతో బాధపడేవారు చెరుకు రసం అసలు తీసుకోకూడదు. దీన్ని తీసుకోవడం వలన మరింత బరువు పెరగవచ్చు. అదేవిధంగా దీనిలో ఉండే చక్కెర శాతం శరీరంలో కొవ్వు పెరగడానికి తోడ్పడుతుంది. కాబట్టి బరువు తగ్గాలి అని ప్రయత్నించేవారు చెరుకు రసం అసల తాగకూడదు.

Sugarcane Juice : ఈ సమస్యలు ఉన్నవారు చెరుకు రసం అస్సలు తాగకూడదు… ఎందుకంటే..?
జలుబు దగ్గు : జలుబు దగ్గు సమస్యతో బాధపడేవారు చెరుకు రసం అసలు తాగకూడదు. దీన్ని తీసుకోవడం వలన ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాక గొంతు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నిద్రలేమి సమస్య : నిద్రలేమి సమస్యతో బాధపడేవారు చెరుకు రసం తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఉండే పోలీకోసనాల్ నిద్ర కు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా మీరు నిద్రలేమి ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.