Sugarcane Juice : సమ్మర్ కదా అని, చెరకు రసం తాగుతున్నారా… అయితే దీని గురించి తెలుసుకోండి…?
ప్రధానాంశాలు:
Sugarcane Juice : సమ్మర్ కదా అని, చెరకు రసం తాగుతున్నారా... అయితే దీని గురించి తెలుసుకోండి...?
Sugarcane Juice : ఎండాకాలం వచ్చేసింది. మండే ఎండల్లో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తూ ఉంటుంది. దాహంగా కూడా ఉంటుంది. అప్పుడు, చల్లటి పానీయాలపై దృష్టి సారిస్తాం. అలాగే కొన్ని జ్యూస్ లు కూడా తాగుతూ ఉంటాం. అలాంటి జ్యూస్ లో ఒకటే చెరుకు రసం. ఈ జ్యూస్ ని తాగడానికి అందరూ అంతగా ఇష్టపడరు. అందరూ మాత్రమే ఈ చెరుకు రసానికి ప్రియులు. తెలుగు రసం తాగిన తర్వాత ఎంతో హాయిగా ఉంటుంది. చెరుకు రసం తాగితే మంచిదే, కానీ అతిగా తాగితే మాత్రం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తెలుగు రసం ఆరోగ్యానికి అంత మంచిది కాదనే విషయం ICMR కూడా చెప్పింది..

Sugarcane Juice : సమ్మర్ కదా అని, చెరకు రసం తాగుతున్నారా… అయితే దీని గురించి తెలుసుకోండి…?
వేసవికాలం ప్రారంభంతోనే వేడి మొదలవుతుంది. ఎండలు మండిపడుతుంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ దాహం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎటైనా బయటికి వెళ్లినప్పుడు దాహం అధికంగా వేస్తుంది. నోరు తడారిపోతుంది. దీంతో ఏదైనా చల్లని పాలెం తాగాలని ఫీలింగ్ కలుగుతుంది. దారిలో చెరుకు రసం కనిపిస్తే తానేస్తాం. కొందరు చెరకు రసాన్ని ఎక్కువగా ఇష్టంగా పదే పదే తాగుతూ ఉంటారు. ఈ చెరుకు రసం తాగితే మజా అనిపిస్తుంది. ఇలా ఎక్కువసార్లు చెరుకు రసాన్ని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ చెరుకు రసం శరీరానికి అంతా మంచిది కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR ) కూడా వెల్లడించింది. 100 మి. లీ చెరుకు రసంలో దాదాపు13-15 గ్రాముల చక్కెర కూడా ఉంటుందని పరిశోధనలో కనుగొన్నారు. పెద్దవారు రోజుకి గ్రాముల కంటే ఎక్కువ చెక్కరను,7-10 సంవత్సరాల వయస్సు గల టీనేజ్ వాళ్ళు 24 గ్రాముల కంటే ఎక్కువ చక్రం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. మండే ఎండల్లో చెరకు రసం తాగకూడదని మాత్రం ICMR చెప్పడం లేదు.
చెరుకు రసాన్ని అతిగా మాత్రం తీసుకోవద్దని చెప్పబడింది. రసం తాగితే శరీరానికి కొంత నష్టం కలగవచ్చు. అయితే దాన్ని తాగితే కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు, పోషక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెరుకు రసంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, భాస్వరం, కాల్షియం,మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వేసవిల చెరుకు రసం తాగితే శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చెరుకు రసంలో ఖనిజాలు, దంతాలు, ఎముకలను బలపరుస్తాయి.
చెరకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు:
. దంతాలు, ఎముకలు బలపరుస్తాయి.
. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
. మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది.
. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
. స్ట్రోక్ అవకాశాన్ని తగ్గిస్తుంది.
. రక్త పోటును స్తిరీకరిస్తుంది.
. వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది.
. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.