Fish Eyes : చేప తలను తింటారు… కానీ దాని కళ్ళను తీసిపడేస్తారు… ఇది తెలిస్తే ఇకనుంచి ఇలా చేయరు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fish Eyes : చేప తలను తింటారు… కానీ దాని కళ్ళను తీసిపడేస్తారు… ఇది తెలిస్తే ఇకనుంచి ఇలా చేయరు…?

 Authored By ramu | The Telugu News | Updated on :19 July 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Fish Eyes : చేప తలను తింటారు... కానీ దాని కళ్ళను తీసిపడేస్తారు... ఇది తెలిస్తే ఇకనుంచి ఇలా చేయరు...?

Fish Eyes : చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. దానిలో ముళ్ళు ఉంటాయని కొందరు తినరు. దాని వాసన కూడా పడదు కొందరికి. కానీ కొందరైతే చేపలను చూడగానే నోరూరినట్లు అవుతుంది. వండుకొని తెగ తినేస్తూ ఉంటారు. తినేటప్పుడు చేప లోని కొన్ని భాగాలను ఇష్టపడరు. చేపలంటే ఇష్టం ఉన్నవారు కూడా చేపల తనను కొందరు తినరు. మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు చేపతన చాలా మంచిది అది తినాలి అని చెబుతూనే ఉంటారు కానీ కొందరు పట్టించుకోరు. చేప తలను అస్సలు ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే చేప తలలో కళ్ళు అస్సలు తినరు. చేప కళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. చేపలను ఎంతో ఇష్టంగా తినేవారు, కేవలం రుచి కోసమే మాత్రం కాదు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, సమృద్ధిగా ఉండే చేపలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. చేపలు తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది శరీర వాపును తగ్గిస్తుంది. ఇంకా, ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు.చేపలు కండరాల వృద్దికి కీలకంగా పనిచేస్తుంది.

Fish Eyes చేప తలను తింటారు కానీ దాని కళ్ళను తీసిపడేస్తారు ఇది తెలిస్తే ఇకనుంచి ఇలా చేయరు

Fish Eyes : చేప తలను తింటారు… కానీ దాని కళ్ళను తీసిపడేస్తారు… ఇది తెలిస్తే ఇకనుంచి ఇలా చేయరు…?

ఈ చేపలలో విటమిన్-డి, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు,ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. చేపలని నడుము భాగం ఎక్కువగా తింటారు. కానీ చేప తలలోనే కళ్ళను మాత్రం పట్టించుకోరు, అసలు తినరు. చేప కళ్ళు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. చేపలు మాత్రమే కాదు, చేప కళ్ళు కూడా అనేక పోషక విలువలను కలిగి ఉంటుందంటున్నారు నిపుణులు. చేపల కళ్ళలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, విటమిన్ ఏ,విటమిన్ బి12,విటమిన్ ఈ, జింక్, ఐరన్ వంటి అనేక ఖనిజాలు అధికంగా ఉంటాయి.చేప కళ్ళు తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే, దీనిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా, మెదడు పనితీరుకి ఎక్కువ మద్దతు లభిస్తుంది. చేపల కళ్ళు తింటే, శరీర వాపులు, నొప్పులు ఇట్లే తగ్గుతాయి. చేపల కళ్ళల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, కంటి సమస్యలను దూరం చేయగలదు దృష్టిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

చేప కళ్ళు రక్తపోటును తగ్గిస్తుంది. చేప కళ్ళల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. చేపకళ్ళను తినడం వలన మనకు నైట్ బ్లైండ్నెస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చేపకళ్ళు మన రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, సమర్థవంతంగా పనిచేస్తాయి. చేప కళ్ళను తింటే, చర్మం ఆరోగ్యం, ఎముకల దృఢత్వం కూడా పెరుగుతుంది. రక్తనాళాల పనితీరు సరిగ్గా జరుగుతుంది. అటిజం వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి, చేపకళ్ళు ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు ఇంకా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. చేప కళ్ళల్లో ఉండే పోషకాలతో మధుమేహం తగ్గుతుంది విటమిన్ డి,అధికంగా ఉండడం చేత చేపల కళ్లను తింటే,శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. చేపల కళ్ళల్లో ఉండే పోషకాలతో క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది