Alcohol : ఆల్కహాల్ త్రాగేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alcohol : ఆల్కహాల్ త్రాగేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :14 May 2023,12:00 pm

Alcohol : ప్రస్తుత కాలంలో చాలామంది మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటివారు ఈ వార్త తప్పకుండా చదవాలి. మద్యం సేవించడం వలన శరీరంపై తీవ్ర చెడు ప్రభావం చూపుతుంది. ఒకేసారి ఎక్కువ మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎక్కువ డ్యామేజ్ కలుగుతుంది. గుండె నుండి కడుపు వరకు శరీరంలో అన్ని భాగాల్లోకి చెడు ప్రభావాన్ని కలగజేస్తుంది. అతిగా మద్యం త్రాగడం వలన ప్రేగులు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసే శక్తిని కోల్పోతుంది. పోషకాలు, విటమిన్ లను సమర్థవంతంగా గ్రహించకుండా అడ్డుపడవచ్చు. అతిగా మద్యం సేవించడం వలన గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు కలిగే అవకాశం ఉంది.

This is something that alcohol drinkers must know

This is something that alcohol drinkers must know

ఆల్కహాల్ తీసుకోవడం వలన కడుపులోని ఎంజైమ్లను కూడా చికాకు పెడుతుంది. దీర్ఘకాలిక మంట, అల్సర్ కు దారితీస్తుంది. ఇది అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. మద్యపానం ఎక్కువగా చేయడం వలన అధిక రక్త పోటుతో సహా గుండె సంబంధించిన వ్యాధులు వస్తాయి. రక్తనాళాల్లోని కండరాలను ప్రభావితం చేస్తుంది. దానిని చాలా వరకు దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది కడుపుపై చెడు ప్రభావాన్ని చూపుతోంది. ఒకేసారి ఆల్కహాల్ ఎక్కువగా త్రాగడం వలన జీర్ణ క్రియ దెబ్బతింటుంది. అలాగే ఆల్కహాల్ వలన మెదడు జ్ఞాపక శక్తి సామర్థ్యం తగ్గుతుంది. ఆల్కహాల్ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. పాదాలు, చేతుల్లో, తిమ్మరింపు వంటి సమస్యలు జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి.

Alcohol and Cholesterol: What's the Relationship?

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్ లను, ఈ శరీరం గ్లూకోస్ నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్యఆంక్రఇయఆస్ లో మంటను కలిగిస్తుంది. ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన పేగుపూత వ్యాధికి కారణం అవుతుంది. ముఖ్యంగా పేగుల్లో ఆల్కహాల్ రసాయన చర్య ద్వారా ప్రేగులను దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆల్కహాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆల్కహాల్ కొద్ది మొత్తంలో తీసుకుంటే మంచిదని, ఓవర్గా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది