Diabetes : ఈ జ్యూస్‌ తాగితే.. మధుమేహం కంట్రోల్ అవుతుంది. మీరు ట్రై చేయండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : ఈ జ్యూస్‌ తాగితే.. మధుమేహం కంట్రోల్ అవుతుంది. మీరు ట్రై చేయండి

 Authored By pavan | The Telugu News | Updated on :16 February 2022,6:30 pm

Diabetes : మధుమేహం.. ఇప్పుడు తరచూ వినిపించే అనారోగ్య సమస్య. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోంది మధుమేహం. ఆహారపు అలవాట్లు, ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా.. మధుమేహం నానాటికీ పెరిగి పోతుంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరినీ కబలిస్తోంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగితే.. డయాబెటిస్‌ లేదా చక్కెర వ్యాధి, మధుమేహం తలెత్తుతుందని వైద్యులు చెబుతారు. ఆహారం తీసుకుంటే శరీరానికి గ్లూకోజ్‌ అందుతుంది. ఈ గ్లూకోజ్‌ కణాలు శక్తిని అందిస్తాయి. శరీరంలో ఇన్సులిన్‌ లోపిస్తే.. ఈ గ్లూకోజ్‌ తన పనిని చేయలేదు. కణాలకు గ్లూకోజ్‌ అందకుండా.. అది కాస్తా రక్తంలో కలవడం మొదలవుతుంది. ఇది మధుమేహానికి దారి తీస్తుంది. ఫలితంగా.. శరీరం కోసం ఆహారం నుంచి శక్తిని తయారు చేయడం కష్టంగా మారుతుంది.

this juice will control blood sugar of diabetics

this juice will control blood sugar of diabetics

మధుమేహం ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది.

టైప్‌-1 డయాబెటిస్‌

టైప్‌-2 డయాబెటిస్‌

గర్భాధారణ డయాబెటిస్‌

మధుమేహం ఉన్న వారిలో ఆహారానిదే ముఖ్య పాత్ర. కొన్ని ఆహారాల్లో జీఐ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గ్లూకోజ్‌ స్థాయి ఎక్కువ అవుతుంది. జీఐ ఆహారాల్లోని కార్బోహైడ్రెట్‌ కంటెంట్‌, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలపై ఎఫెక్ట్‌ అవుతుంది.

మధుమేహాన్ని కంట్రోల్‌ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిస్‌కు దానిమ్మ రసం మంచిగా పనిచేస్తుందని వైద్యులు చెబుతారు. దానిమ్మ రసం తాగడం వల్ల అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. మధుమేహం రోగుల్లో దానిమ్మ రసం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా అంటారు.

గ్రీన్‌ టీ కంటే కూడా దానిమ్మ రసం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. గ్రీన్ టీ కంటే దానిమ్మ రసంలో మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని చెబుతారు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సునిల్‌ స్థాయిలపై ఎక్కువ ప్రభావం చూపకుండా కాపాడతాయని పరిశోధకులు అంటున్నారు. మధుమేహం పేషెంట్లలో దానిమ్మ రసం ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది