Dried Lemons : ఎండిన నిమ్మకాయలను పారేస్తున్నారా… వాటిని ఇలా వాడండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dried Lemons : ఎండిన నిమ్మకాయలను పారేస్తున్నారా… వాటిని ఇలా వాడండి…!

Dried Lemons : మనం నిమ్మకాయలను ఏదో ఒక రకంగా వాడుతూనే ఉంటాం. ఈ నిమ్మకాయలు అనేవి ప్రతి సీజన్లో దొరకవు. ఈ నిమ్మకాయలు కొన్ని సీజన్లో మాత్రమే దొరుకుతాయి. అలాంటి టైంలో వాటిని మనం ఎక్కువగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అయితే అవి కొన్ని రోజులకు ఎండిపోతాయి. ఎండిన ఈ నిమ్మకాయలను పారేస్తూ ఉంటాం. అలా చేయకుండా వీటిని ఎలా వాడాలో తెలుసుకోండి. వీటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. నిమ్మకాయ బెనిఫిట్స్ : ఈ నిమ్మకాయలతో […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Dried Lemons : ఎండిన నిమ్మకాయలను పారేస్తున్నారా... వాటిని ఇలా వాడండి...!

Dried Lemons : మనం నిమ్మకాయలను ఏదో ఒక రకంగా వాడుతూనే ఉంటాం. ఈ నిమ్మకాయలు అనేవి ప్రతి సీజన్లో దొరకవు. ఈ నిమ్మకాయలు కొన్ని సీజన్లో మాత్రమే దొరుకుతాయి. అలాంటి టైంలో వాటిని మనం ఎక్కువగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అయితే అవి కొన్ని రోజులకు ఎండిపోతాయి. ఎండిన ఈ నిమ్మకాయలను పారేస్తూ ఉంటాం. అలా చేయకుండా వీటిని ఎలా వాడాలో తెలుసుకోండి. వీటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. నిమ్మకాయ బెనిఫిట్స్ : ఈ నిమ్మకాయలతో ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ కాయలను ఎక్కువగా ఎండాకాలంలో డ్రిక్స్ చేసుకొని తాగుతూ ఉంటాం. దీని కోసమే కాక చర్మానికి మరియు జుట్టును రక్షించడానికి కూడా వాడతాము…

సూప్స్ : ఎండిన నిమ్మకాయలలో పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని చారు మరియు పులుసు,చేపలు, సుప్ లాంటివి చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. అయితే వాటిని వాడే ముందు ఒకసారి చెక్ చేసుకుని అవి పూర్తిగా చెడిపోకపోతేనే వాడండి.

నోటి దుర్వాసన : కొన్ని కొన్ని సార్లు నోరు అనేది దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు నిమ్మ తొక్కల నుండి మొత్తం రసాన్ని పిండేసి దంతాలపై రుద్దండి. మరి ఎక్కువగా కూడా రుద్దకండి. ఒకసారి మాత్రమే అలరుద్ది వదిలేయండి. ఇలా చేయటం వలన మరకలు తగ్గి దంతాలు కూడా క్లీన్ గా అవుతాయి…

ఇల్లు క్లీన్ చేయండి : మీరు ఇంటిని క్లీన్ చేసుకునేటప్పుడు కూడా నీటిలో నిమ్మ రసాన్ని కలపండి. ఇలా చేయటం వలన ఫ్లోర్ పై ఉన్న క్రిములు మరియు మురికి తొందరగా పోతాయి. కావున నిమ్మకాయలను పడేయకుండా ఎలా ఇంటిని క్లీన్ చేసుకునేందుకు వాడండి.

గిన్నెలు క్లీన్ : ఈ ఎండినటువంటి నిమ్మకాయలను కట్ చేసుకుని గిన్నెలో ఉన్నటువంటి మరకల దగ్గర రుద్ది వాటిని క్లీన్ చేసుకోవచ్చు. అయితే వీటిల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు మరియు సోడా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం వేసి మరకలు ఉన్న దగ్గర రుద్దినట్లయితే మరకలు మరియు జిడ్డు తొందరగా పోతుంది. ఇతరుల మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి.

Dried Lemons ఎండిన నిమ్మకాయలను పారేస్తున్నారా వాటిని ఇలా వాడండి

Dried Lemons : ఎండిన నిమ్మకాయలను పారేస్తున్నారా… వాటిని ఇలా వాడండి…!

బట్టలు క్లీన్ : మన బట్టల పై ఎన్నో రకాల మరకలు అనేవి పడతాయి. అలాంటి టైంలో ఈ నిమ్మకాయలను మరకలు వదిలించడానికి కూడా వాడవచ్చు. అయితే ముందు మరకలపై కొద్దిగా డిటర్జెంట్ రాసిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని వేసి రుద్దితే తొందరగా మురికి వదులుతుంది.

స్క్రబ్ లా : ఈ నిమ్మకాయలు అనేవి మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిని ఎండలో ఆరబెట్టుకొని పొడి చేసుకోండి. ఆ మిశ్రమాన్ని మీరు శనగపిండిలో కలుపుకొని చర్మానికి నలుగులా పెట్టుకొని స్నానం చేయండి. దీంతో మీ చర్మంపై ఉన్న మురికి ఈజీగా పోతుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది