Tomato Remedy : టమోటా రుచికి కాదు.. దాన్ని ఇలా ఉపయోగిస్తే బోలెడు ప్రయోజనాలు…!
Tomato Remedy : అందరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అందులో ముఖ్యంగా అమ్మాయిలకు మరి ఎక్కువగా ఈ కోరిక ఉంటుంది. అందులో తామే స్పెషల్ ఎట్రాక్షన్ కావాలని తానే అందంగా మెరిసిపోవాలని ఉంటుంది. అందుకే కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఎన్ని క్రీములు వాడిన తమ చర్మం జిండుగా ఉంటుందని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్ తో తప్పనిసరిగా శుభ్రపరుస్తారు.అయితే కొన్ని […]
ప్రధానాంశాలు:
Tomato Remedy : టమోటా రుచికి కాదు.. దాన్ని ఇలా ఉపయోగిస్తే బోలెడు ప్రయోజనాలు...!
Tomato Remedy : అందరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అందులో ముఖ్యంగా అమ్మాయిలకు మరి ఎక్కువగా ఈ కోరిక ఉంటుంది. అందులో తామే స్పెషల్ ఎట్రాక్షన్ కావాలని తానే అందంగా మెరిసిపోవాలని ఉంటుంది. అందుకే కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఎన్ని క్రీములు వాడిన తమ చర్మం జిండుగా ఉంటుందని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్ తో తప్పనిసరిగా శుభ్రపరుస్తారు.అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఎంతో అందంగా తయారవ్వచ్చు. ఇందులో ఒకటే టమాట. దీన్ని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వచ్చో చూద్దాం.. ఓపెన్ ఫోర్సు సమస్య ఉన్నవారు కాస్త ములతాన్ మట్టి తీసుకోండి. అందులో టమాటా జ్యూస్ వేసి బాగా కలపండి. ఇలా తయారైన ప్యాక్ ని ముఖంపై వేసుకోండి. ఇలా చేయడం వల్ల చాలా వరకుఓపెన్ పోరేసెస్ తగ్గుతుంది. ఎండకు కమిలిన చర్మాన్ని తిరిగి అందంగా మార్చడంలో టమాట బాగా పనిచేస్తుంది.
కొద్దిగా టమాటా రసం తీసుకుని అందులో కాస్త మజ్జిగ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కాస్త ఆయన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రాయడం వల్ల టాన్ సమస్య కూడా తగ్గుతుంది. టమాటలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మ రంగును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇందుకోసం కొన్ని ప్యాక్స్ కూడా వాడొచ్చు.. ముందుగా రెండు చెంచాల టమాటా గుజ్జు తీసుకోవాలి. ఇందులో కాస్త తేనె కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముందుగా ముఖం మేడని శుభ్రం చేసుకొని ముఖంపై రాయాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమా అందుతుంది.
టమాట గుజ్జులో ఏం కలపకుండా అది మాత్రమే ముఖం మెడకు రాసి ఆరిన తర్వాత కడిగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది నాచురల్ రెమిడీ కాబట్టి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా చేయటం వల్ల కేవలం మచ్చలు తగ్గడమే కాకుండా అందంగా, మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. కాసింత శెనగపిండిని తీసుకోండి. అందులో ఇప్పుడు టమాటా గుజ్జుని కలపండి. ఇక మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారైన పాక్ ని ముఖానికి పూతలాగా వేసుకోవాలి. ఆరిన తర్వాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్లా చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మారుతుంది. ముఖం రంగుని కూడా మెరుగుపరచడంలో ఈ పాక్ బాగా పనిచేస్తుంది..