Health Benefits : ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే చాలు.. సర్వ రోగ నివారణి మీ వెంట ఉన్నట్లే!
Health Benefits : అజ్వైన్ లేదా కరోమ్ లేదా వాము. ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అనేక ఆయుర్వేద చికిత్సలతో పాటు ప్రతిరోజూ భారతీయ వంటకాల్లో వాడే ఈ విత్తనాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా ట్రాకిస్పెర్మ్ అమ్మీ అని పిలవబడే ఈ మొక్క.. భారత దేశం, మధ్య ప్రాచ్యానికి చెందినది. దీని ఘాటు తీవ్రమైన రుచి వల్ల వీటిని మనం తరచుగా వంటల్లో వాడుతుంటాం. అయితే వాము గురించి అందరికీ తెలిసినప్పటికీ.. వాము ఆకుల గురించి మాత్రం చాలా మందికి తెలియదు.అత్యంత ప్రయోజనాలను చేకూర్చే వాము ఆకులను మీ వంటగది తోటలో చిన్న పూల కుండీలో సులబంగా పెంచుకోవచ్చు.
ఇది మందంగా ఉండే ఈ ఆకుపచ్చ ఆకులు మరియు సువాసన కల్గిన మొక్క. ఈ వాము ఆకులు వంటల్లో రుచితో పాటు ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే కడుపు నొప్పిని నయం చేస్తుంది. అంతే కాకుండా అనేక రకాల కడుపు సంబంధిత సమ్సయలను కూడా తొలగిస్తుంది. ఈ ఆకులను నమలడం వల్ల శరీరంలోని అసౌకర్యం నుండి ఉపశమనం పొందవచ్చు. వాము ఆకులతో పాటు కాస్త తేనెను కలిపి తినడం వల్ల సాధారణ జలుబు నుంచి ఉపశమనం పొందొచ్చు. చిన్న పిల్లలకు ఈ ఆకు రసంలో కాస్త తేనె కలిపి తాగిస్తుంటారు. ఇలా తాగించడం వల్ జలుబు తగ్గడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శీరరంలో జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయ పడతాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి రోజు వారీ భోజనం తర్వాత రోజుకొక ఆకు చొప్పున వీటిని తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో ఆకలిని పెంచడానికి వీటిని ఎక్కువగా వాడుతుంటారు.అలాగే నోటి నుంచి దుర్వాసన వచ్చే వారు ఈ ఆకులను నమలడం వల్ల ఆ సమస్యను తొలగించుకోవచ్చు. అందుకే దీన్ని సహజ నోటి ఫ్రెషనర్ అని కూడా పిలుస్తుంటారు. వాము ఆకులతో పకోడీలు, బజ్జీలు వంటివి తయారు చేసుకోవచ్చు. రైతా మరియు సలాడ్లలో ఈ వాము ఆకులను చేర్చుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదండోయ్ వాము ఆకులతో పాటు తులసి ఆకులను కలిపి ఆమ్ చూర్ పౌడర్ ను తయారు చేస్తారు. నిర్జలీకరణాన్ని నివారించడానికి వేసవి కాలంలో వీటిని తినవచ్చు.