Health Benefits : నాలుగే నాలుగు కివీ ముక్కలు చాలు.. నలు మూలల్లో ఉన్న కొవ్వును కరిగించడానికి!
Health Benefits : కివీలు గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. పుల్ల పుల్లగా ఉండే ఈ పండులో విటామిన్ సి, డైటరీ పైబర్ లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొంవదచ్చు. ఈ పండ్లు గుండె ఆరోగ్యం, జీర్ణ క్రియ, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. కివీ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎంతాగనో ఉపయోగపడతాయి. అయితే పులుపు, తీపి కల్గి కాస్త గుడ్డు లాంటి ఆకారం కల్గిన దీనిని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు.కివీస్ లో ఉండే విటామిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏరపడే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాకుండా కడుపులో ఏర్పడే మంటను కూడా తగ్గిస్తుంది. కివీ పండులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడంలో సాయపడడం, విటామిన్ సి యొక్క బూస్ట్ ను అందించడం ద్వారా కివీ పండు స్ట్రోక్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనికి మించి కివీలో అధిక స్థాయి డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఫఐబర్ ఎల్డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె జబ్బులకు సంబంధించిన ప్రమాద కారకాలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ మిగులు అథెరోస్క్లే రోసిస్ కు దారి తీస్తుంది.
ఇది గుండె లోపల ధమనులు గట్టి పడేలా చేస్తుంది.అలాగే కివీపై పోర అలాగే పండు గుజ్జులో అధిక మత్తంలో డైరటీ ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, వివిధ రకాల ఇతర జీర్ణాశయంతర సమస్యలు మరియు అసౌకర్యాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే ఆస్తమాను కూడా తగ్గిస్తుంది. కివీలో ఉండే విటామిన్లు, ఖనిజాలు.. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. చిన్న పిల్లలకు కివీస్ తినిపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదండోయ్ గురకతో ఇబ్బంది పడే వాళ్లకు.. ఈ సమస్యను దూరం చేయడంలో కివీస్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకొక కివీ పండు తిన్నా సరే గురక సమస్యను దూరం చేసుకోవచ్చు.