Walnut Oil : వాల్ నట్ తోనే కాదు.. వాలెట్ ఆయిల్ తో కూడా బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే వెంటనే వాడతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Walnut Oil : వాల్ నట్ తోనే కాదు.. వాలెట్ ఆయిల్ తో కూడా బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే వెంటనే వాడతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :28 February 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Walnut Oil : వాల్ నట్ తోనే కాదు.. వాలెట్ ఆయిల్ తో కూడా బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే వెంటనే వాడతారు...!

Walnut Oil : వాల్ నట్స్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఇది నట్స్లో రారాజు అని చెప్పవచ్చు. అయితే వాల్ నట్స్ కాకుండా వాల్ నట్స్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు వాల్నట్స్ తీసుకోవటం వలన పలు వ్యాధులు కూడా రావు. అలాగే వాల్నట్ ఆయిల్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..శరీరానికి ఈ ఆయిల్ వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు. దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. వాల్నట్స్ ఆయిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ వాల్నట్స్ ఆయిల్ జుట్టుకి,చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యం కోసం.వాల్నట్స్ ఆయిల్ వలన గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెంచటానికి ఎంతో సహాయపడతాయి. దీనివలన గుండె ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వాల్నట్ ఆయిల్ తో రక్త పోటు కూడా తగ్గుతుంది..క్యాన్సర్, డయాబెటిస్ తగ్గిస్తుంది..ఈ ఆయిల్ షుగర్ పేషెంట్ కు ఎలాంటి సందేహాలు లేకుండా వాడొచ్చు. ఈ ఆయిల్ వలన రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించటంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగనీయకుండా, కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది. దీని వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి..

ఎముకల ఆరోగ్యం..వాల్నట్స్ ఆయిల్లో కాలుష్యం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. కావున ఎముకలు బలంగా ఉండటంలో ఎంతో సహాయం చేస్తాయి. అంతేకాక మలబద్దకాన్ని తగ్గించటం తో పాటు జీర్ణ క్రియను మెరుగుపరచటంలో ఈ ఆయిల్ఎంతో సహాయం చేస్తుంది. చర్మ సమస్యలకు.. ఈ ఆయిల్ వలన చర్మ సమస్యలను దూరం చేయవచ్చు. వాల్నట్స్ తీసుకోవడం వలన చర్మం సాఫ్ట్ గా,హైడ్రేటుగా,కాంతివంతంగా ఉండటానికి సహాయం చేస్తుంది. మన శరీరంపై ఉండే ముడతలు, గీతలనుకూడా తొలగిస్తుంది. వృద్ధాప్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలు దెబ్బ తినకుండా కాపాడుతూ ఉంటుంది.జుట్టు పెరుగుదలకు.వాల్నట్స్ ఆయిల్ వలన జుట్టు ఎంతగానో పెరుగుతుంది. జుట్టు రాలకుండా ఉండటానికి ఈ ఆయిల్ ఎంతగానోసహాయపడుతుంది. ఈ ఆయన్ని తనకి అప్లై చేసుకున్న కానీ జుట్టుకి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది