Water Melon : పుచ్చకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..? ఆశ్చర్యకరమైన విషయాలు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Water Melon : పుచ్చకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..? ఆశ్చర్యకరమైన విషయాలు…!

Water Melon  : సమ్మర్ లో అందరూ ఎక్కువగా ఇష్టంగా తినే పండు పుచ్చకాయ.. పుచ్చకాయ తినడం వలన శరీరం చల్లబడుతుంది.. ఎందుకంటే పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. శరీరాన్ని హైడెడ్ గా ఉంచడానికి పుచ్చకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పుచ్చకాయతో శరీరం హైడ్రేట్ గా ఉండడమే కాదు.. ఇంకా ఎన్నో వ్యాధులను తగ్గించడానికి పుచ్చకాయ చాలా బాగా సహాయపడుతుంది. మరి ఆ వ్యాధులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రక్తంలో అధిక […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Water Melon : పుచ్చకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..? ఆశ్చర్యకరమైన విషయాలు...!

Water Melon  : సమ్మర్ లో అందరూ ఎక్కువగా ఇష్టంగా తినే పండు పుచ్చకాయ.. పుచ్చకాయ తినడం వలన శరీరం చల్లబడుతుంది.. ఎందుకంటే పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. శరీరాన్ని హైడెడ్ గా ఉంచడానికి పుచ్చకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పుచ్చకాయతో శరీరం హైడ్రేట్ గా ఉండడమే కాదు.. ఇంకా ఎన్నో వ్యాధులను తగ్గించడానికి పుచ్చకాయ చాలా బాగా సహాయపడుతుంది. మరి ఆ వ్యాధులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉండడం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. సరైన అలవాట్లు లేకపోవడమే దీనికి కారణం అవుతుంది.. ఈ సమ్మర్ లో ఈ లోపాన్ని తగ్గించటానికి పుచ్చకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.

కొద్దిపాటి పుచ్చకాయలు ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరానికి ఎక్కువ నీరు అవసరమయ్యే ఈ వేడి సీజన్ లో చాలామంది పుచ్చకాయను తీసుకుంటూ ఉంటారు..

Water Melon  : పోషకాలు సమృద్ధిగా

పుచ్చకాయ ఎటువంటి వాదనలు లేకుండా పోషకాలు పుష్కలంగా ఉండే పండు. ఇది విటమిన్ ఏ, సి యొక్క అద్భుతమైన మూలం ఇది శరీరకణాలను దెబ్బ తినకుండా కాపాడడంలో ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.అలాగే ఇది సరియైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని నిర్వహించడానికి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.యాంటీ ఆలర్జీ లక్షణాలు; పుచ్చకాయలు యాంటీ అలర్జీటిక్ లక్షణాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుందని తెలుపుతుంది..

రీప్లేషింగ్: పుచ్చకాయలు నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది దాహాన్ని తీర్చి మనల్ని రిఫ్రెష్ గా ఉంచుతుంది. పుచ్చకాయ వేసవి పానీయాల డిమాండ్ ను చాలా వరకు తగ్గిస్తుంది..

Water Melon పుచ్చకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా ఆశ్చర్యకరమైన విషయాలు

Water Melon : పుచ్చకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..? ఆశ్చర్యకరమైన విషయాలు…!

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు: పుచ్చకాయలు లైకోపీన్ విటమిన్ సి లాంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లైకోపిన్ ఒక శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ కారకం. ఇది గుండె ఆరోగ్యంలో లైకోపీన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వలన కలిగే సేల్ డ్యామేజ్ నుంచి కూడా రక్షిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి..
పుచ్చకాయ సహజంగా శరీరము తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ ఎల్డీఎల్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందని చాలా పరిశోధనలో తేలింది. కొన్ని పరిశోధన ప్రకారం పుచ్చకాయలలో లైకోపీన్ సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ రక్తపోటుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో అనే అమినో యాసిడ్ కూడా ఉంటుంది. ఇది రక్తనాళాలను విస్తరిస్తుంది. మరి రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది..

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది