లో బీపీతో టెన్షన్ పడుతున్నారా? ఈ ఫుడ్ తీసుకోండి.. జన్మలో మీకు లో బీపీ రాదు..!
లో బీపీ దీన్నే లో “బ్లడ్ ప్రెషర్” లేదా “హైపో టెన్షన్” అని పిలుస్తారు. హై బీపీ సమస్యలాగే లో బీపీ సమస్య కూడా ఉంటుంది. లో బీపీ రావడానికి బాధితుల వయస్సు, ఆరోగ్య చరిత్ర, ఇతర స్థితిగతుల ఆధారంగా లో బీపీ సమస్య అనేది మారుతుంటుంది.
లో బీపీ లక్షణాలు:
కంటి చూపు మసక బారుతుంది. కంగారు, ఏకాగ్రత లోపించడం, దేనిపై సరిగ్గా ధ్యాస పెట్టలేకపోవడం. తల తిరగడం, స్పృహ తప్పి పడిపోవడం, నీరసం, వికారం, వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
లో బీపీ నుండి బయటపడటానికి తీసుకోవలసిన ఆహారాలు
డీహైడ్రేషన్ సమస్య కారణంగా రక్తం పరిమాణం తగ్గుతుంది. కాబట్టి లోబీపీ ఉన్నవారు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో బీపీ తక్కువవుతుంది. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ లను తాగడం వల్ల తాత్కాలికంగా బీపీ పెరుగుతుంది. బీపీ మరీ తక్కువగా ఉందనుకునే వారు వీటిని తాగితే తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. అయితే కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. కనుక కాఫీ, టీలను మోతాదులో మాత్రమే తాగాలి. ఉప్పు ఎక్కువగా తింటే హై బీపీ ఉన్నవారికి ప్రమాదం కానీ లోబీపీ ఉన్నవారు ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కువగా తినాలి.
దీంతో బీపీ పెరుగుతుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా సూప్లు, చీజ్, పనీర్, చేపలు, ఊరగాయలు తినడం వల్ల ఉప్పు ఎక్కువగా లభిస్తుంది. లోబీపీ రావడానికి ముఖ్య కారణం శరీరంలో బీ12 లోపించడమే. కాబట్టి బి12 విటమిన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా గుడ్లు, తృణ ధాన్యాలు, మటన్ లివర్, న్యూట్రిషనల్ ఈస్ట్, చికెన్ బ్రెస్ట్, పెరుగు, చేపలు వంటి పదార్థాల్లో బి12 అధికంగా లభిస్తుంది. వీటిని తరచు తీసుకుంటూ ఉండాలి. ఎర్ర రక్త కణాలను తయారు చెయ్యడానికి ఫోలేట్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందువల్ల ఫోలేట్ ఉండే ఆహారాలను తీసుకుంటే లో బీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. ఫోలేట్ ఎక్కువగా నిమ్మజాతి పండ్లు, పప్పు దినుసులు, బీన్స్, ఆకుపచ్చని కూరగాయలు, గుడ్లు, లివర్లలో లభిస్తుంది. వీటిని తింటే లో బీపీ రాకుండా చూసుకోవచ్చు.
ఇది కూడా చదవండి ==> ప్రొటీన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ లో ఉంటాయి? ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే లాభాలు ఏంటి?
ఇది కూడా చదవండి ==> పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయా? వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> నిత్యం పెసలు తింటే కలిగే లాభాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు..!
ఇది కూడా చదవండి ==> అన్ని వంట నూనెలు పక్కన పెట్టి.. కొబ్బరి నూనెను ఆహారంలో వాడి చూడండి.. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..!