Banana – Apple : యాపిల్ అరటిపండు కలిపి తింటున్నారా… అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి…!!
Banana – Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే అరటి పండులో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్లు ఆరోగ్యకర కొవ్వులు మినరల్స్ సంపూర్ణంగా ఉంటాయి. ఇక ఈ పండు ఆరోగ్యానికి అవసరమైన సమతుల్య ఆహారం అందిస్తుంది. అదేవిధంగా ఆపిల్ లో పొటాషియం మెగ్నీషియం బీట కెరోటిన్ మరియు ఫైబర్ అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఈ పండ్లు ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. ఆపిల్ పండు విటమిన్ ఏ సీ , కాలుష్యం మరియు పొటాషియం వంటి పోషకలను అందించడంతో పాటు మధుమేహం క్యాన్సర్ గుండెకు సంబంధించిన వ్యాధులు ఇలా మరెన్నో వ్యాధులతో పోరాడేటువంటి శక్తిని ఆపిల్ అందిస్తుంది. అలాగే ప్రతిరోజు ఆపిల్ తినడం వలన పెక్తిన్ , ఫైబర్, శరీరంలో చక్కెర కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణ చేయడంలో సహాయపడుతుంది.
ఇక అరటిపండు విషయానికి వస్తే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండడం వలన బీపి అదుపులో ఉంటుంది. అంతేకాదు అరటిపండు లోని మినరల్స్ విటమిన్స్ ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు అరటిపండును తీసుకోవడం మంచిది…
అయితే శారీరకంగా తక్కువ శక్తి ఉన్నవారు ప్రతిరోజు ఆపిల్ అరటి పండుని కలిపి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే ఈ రెండు పండ్లను కలిపి తినడం వలన రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు అరటిపండు ఆపిల్ కలిపి తినడం మంచిది. ఈ క్రమంలోనే అరటిపండు యాపిల్ లోని కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఇక ఈ పండ్లను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వలన గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకి ఒకటి రెండు పండ్లను మాత్రమే తీసుకోవడం ఉత్తమం…