Weight Loss : ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఈ జ్యూస్ తో అధిక బరువు సులభంగా తగ్గించుకోవచ్చు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Weight Loss : ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఈ జ్యూస్ తో అధిక బరువు సులభంగా తగ్గించుకోవచ్చు..!!

Weight Loss : ప్రస్తుతం సరియైన జీవనశైలి లేకపోవడంతో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. వీటికి కారణం ఆహారపు అలవాట్లు. అయితే బరువు పెరినంత ఈజీగా తగ్గడం మాత్రం ఈజీగా అవ్వడం లేదు.. దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అధిక బరువు తగ్గడానికి నిత్యం వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. బరువు తగ్గడానికి మీరు రోజు తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించాలి. అలాగే డైట్ లో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 February 2023,8:00 am

Weight Loss : ప్రస్తుతం సరియైన జీవనశైలి లేకపోవడంతో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. వీటికి కారణం ఆహారపు అలవాట్లు. అయితే బరువు పెరినంత ఈజీగా తగ్గడం మాత్రం ఈజీగా అవ్వడం లేదు.. దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అధిక బరువు తగ్గడానికి నిత్యం వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. బరువు తగ్గడానికి మీరు రోజు తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించాలి. అలాగే డైట్ లో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు కూడా చేర్చుకున్నట్లైతే ఎంతో సహాయంగా ఉంటుంది. ఈ పానీయాలు తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అలాగే మీ జీర్ణక్రియ వేగవంతంగా పనిచేస్తుంది. శరీరంలో యాక్సిడెంట్ ను బయటికి నెట్టి వేస్తుంది..

You can easily reduce excess weight with this juice that is easily prepared at home

You can easily reduce excess weight with this juice that is easily prepared at home

అయితే శరీరానికి కావాల్సిన పోషకాలని ఇస్తూ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఆ పానీయాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం.. *అజ్వైన్ నీరు బరువు తగ్గాలనుకునే వాళ్ళు క్యారం గింజలను నీటితో అధికంగా తీసుకుంటూ ఉంటారు. గింజల నీరు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఉదయం పరిగడుపున ఈ నీటిని తీసుకున్నట్లయితే బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది. *గ్రీన్ టీ:
గ్రీన్ టీ బరువు తగ్గించడంతోపాటు జీవక్రియను పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ గ్రీన్ టీ లో కెఫిన్ లాంటి ప్రధానమైన బయో ఆక్ట్ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియ రేటును పెంచడంలో ఉపయోగపడతాయి. ఈ గ్రీన్ టీ బరువు తగ్గించడానికి ఓ గొప్ప మార్నింగ్ డిటెక్స్ డ్రింక్.

అలాగే బలమైన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గ్రీన్ టీ లో తేనె ,నిమ్మ, పుదీనా ఆకులు చేర్చుకొని తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. *నిమ్మరసం : పరిగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గిపోతుంది. అలాగే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం వాకింగ్ కి వెళ్లేటప్పుడు ఒక గ్లాసులో సగం నిమ్మకాయను పిండుకొని తాగండి మీకు తీయగా కావాలనుకుంటే దానిలో కొంచెం తేనెను కలుపుకోవచ్చు. రుచితో పాటు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. *సిట్రస్ నీరు : తొందరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు వాటర్ డిటెక్స్ చాలా ముఖ్యం. బరువు తగ్గటంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో రకాల వాటర్ రేసిపిలను ట్రై చేయాలి.

Weight Loss Tips: బరువు తగ్గాలంటే.ఇంట్లోనే సులభంగా తయారు చేసే ఈ జ్యూస్‎లు ఓసారి ట్రై చేసి చూడండి..!!

రోజు కేవలం నీటిని మాత్రమే తాగాలంటే కాస్త బోర్ గా ఉంటుంది. కావున పుదీనా, దోసకాయ, నారింజ, నిమ్మ ముక్కలను కలిపి సిట్రస్ నీటిని తయారు చేసుకోవచ్చు. ఈ నీటిని ప్రతిరోజు ఉదయం తీసుకుంటే బరువు తొందరగా తగ్గుతారు. *పసుపు పాలు: బరువు తగ్గాలనుకునే వాళ్ళు పసుపాలు చాలా బాగా ఉపయోగపడుతుంది. పసుపులు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. కావున దీనికి వైద్య పరంగా వినియోగించడమే కాకుండా వంటల్లో కూడా వాడుతుంటారు. ఆయుర్వేద వైద్యంలో దీనిని చర్మ రుగ్మతలు, అలర్జీలు, కీళ్ల నొప్పులు లాంటి వ్యాధులకు నివారణగా వాడుతుంటారు. ఈ పసుపుపాలు పడుకునే ముందు తాగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే శరీరంలో కొవ్వు, కోల్పోతుంది అని చెప్పడం జరిగింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది