Drink Water : మంచినీళ్లు ఎక్కువగా తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drink Water : మంచినీళ్లు ఎక్కువగా తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే…!

 Authored By aruna | The Telugu News | Updated on :7 August 2023,8:00 am

Drink Water : మనం ప్రతిరోజు ఎంత నీరు తీసుకోవాలి. అలాగే చక్కెర శాతం మన శరీరంలో ఎంత ఉండాలి. ఎంతుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అనే ఈ రెండు విషయాల మీద ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం.. మన శరీరం నీటితో నిండు ఉంటుంది. ఆ నీరు చెమట మూత్రం రూపంలో మన శరీరం నుండి బయటపడుతుంది. అందుకే ఎప్పుడూ మనం మన శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటుగా ఉంచుకోవడానికి ఎన్ని నీళ్లు తాగాలి అని మనలో చాలామందికి డౌట్ వస్తుంది. మన మూత్రపిండాలు ఒక రోజులు 20 నుంచి 28 లీటర్ల నీళ్లను ఫిల్టర్ చేయగలవు. కానీ ఒక గంటలో ఒక లీటర్ కన్నా ఎక్కువ ఫిల్టర్ చేయలేదు. మన సెల్సులో సోడియం పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ మనం తాగే నీళ్లలో కూడా ఉంటాయి.

వీటిని మన మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. కానీ ఒక లిమిట్ వరకు మాత్రమే ఫిల్టర్ చేయగలవు. నీరు ఎక్కువగా తాగినట్లయితే ఎలక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా మన శరీరంలో చేరతాయి. మూత్రపిండాలు కూడా వీటిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ లో ప్రవేశిస్తాయి. ఫలితంగా సెల్ సైజు పెరుగుతుంది. మరియు సెల్స్ వాపుకు గురవుతాయి. మన శరీరం 60% నీటితో నిండు ఉంటుంది. ఒకరోజులో రెండు లీటర్ల నీళ్లను తాగాలి అని విని ఉంటారు కదా.. కానీ శాస్త్రవేత్తల ప్రకారం మరియు వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ ప్రకారం కొన్ని మనకు తెలియని విషయాలు చెప్పారు. మనం రోజు తినే ఆహార పదార్థాల్లో 20% నీరు ఉంటుంది. మనం రోజు తాగేటి కాఫీ జ్యూస్లలో కూడా నీరు ఉంటుంది. ఇలా ఒక రోజులు ఆహార పదార్థాల ద్వారా మన శరీరం హైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.

అదేంటంటే ఎక్కువ నీరు తాగడం చాలా ప్రమాదకరం. ప్రతి మనిషి శరీరంలో 65% వరకు నీరు ఉంటుంది. శరీర బరువులో సగం నీరు శాతం అని చెప్పొచ్చు. అయితే వయసు రీత్యా నీటి పరిమాణంలో కూడా మార్పులు ఉంటాయి. పెద్దల గురించి మాట్లాడితే వారి శరీరంలో 65% నీరు ఉంటుంది. ఈ నీరు శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది. అసలు ఒక వ్యక్తికి రోజుకు ఎంత నీరు అవసరం అనేది తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి శరీరం గా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నేటి పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది. శరీర బరువును బట్టి మీరు నీరు తాగాల్సి ఉంటుంది. మీరు 70 కిలోలు శరీర బరువు ఉంటే అప్పుడు 3.5 లీటర్ల నీరు తాగాలి. 80 కిలోలు ఉంటే నాలుగు లీటర్ల నీరు తాగాలి. అకాడమీ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారం ఒక మహిళా ప్రతిరోజూ 2.7 l నీరు తాగాలి.

your body when you drink too much fresh water

your body when you drink too much fresh water

అదే మగవాళ్ళు అయితే 3.7 లీటర్ల నీటిని తాగాలి. కొంతమంది నీళ్లు ఎక్కువ తాగండి మీ బాడీ క్లీన్ అయిపోతుంది అని ఈ మధ్య చాలా మంది చెబుతున్నారు. మన బాడీ మనతో మాట్లాడుతుంది. మీరు జాగ్రత్తగా వినండి. నీరు తాగాలి అనిపించినప్పుడు మీకు తాగిన తర్వాత చాలు అనిపిస్తే అంతవరకే తాగండి. మళ్లీ దాహం వేసినప్పుడే తాగండి. అంతేగాని గుర్తించినప్పుడల్లా నీళ్లు పట్టించడం అది కూడా లీటర్ల కొద్దిగా పట్టించడం అనేది కిడ్నీలో పనితీరును దెబ్బతీస్తుందని మర్చిపోకండి. అలాగే షుగర్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇలా మనకు అన్ని తెలుసు కదా.. అనుకుంటూనే నీరు ఎక్కువ తాగి మంచి ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటామని బ్రమలో అతిగా తీసుకోవడం వల్ల కూడా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మీరు తినే ఆహారంపై కాస్త ఫోకస్ పెడితే చాలు ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది