Zika virus : జీకా వైరస్ వచ్చినప్పుడు కనపడే లక్షణాలు ఇవే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zika virus : జీకా వైరస్ వచ్చినప్పుడు కనపడే లక్షణాలు ఇవే…

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Zika virus : జీకా వైరస్ వచ్చినప్పుడు కనపడే లక్షణాలు ఇవే...

Zika virus : వర్షాకాలం వచ్చింది. ఈ కాలం వచ్చింది అంటే చాలు, దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమల వలన మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతం మనం భయపడుతున్న ఈ రెండు వ్యాధులతో పాటుగా జికా వైరస్ తోడైంది. నిజం చెప్పాలంటే.ఈ జికా అనేది దోమ కాటు వల్ల వచ్చే వ్యాధి అన్నమాట. ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసరికి సాధారణ ఫ్లూ లాగే ఉంటుంది.ఈ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం వస్తుంది. దీని మొదటి లక్షణం జ్వరమే. అలాగే మలేరియా,డెంగ్యూ లాంటి విష జ్వరాలు అనేవి జికా దోమ కాటు వలన వస్తుంది. కానీ ఈ వ్యాధి మాత్రం డెంగ్యూ కి చాలా భిన్నమైనది. ఎన్నో సందర్భాలలో ఈ వ్యాధి అనేది ప్రమాదకరమైనది కూడా కావచ్చు. జీకా అనేది ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి అనేది ఒకరి నుండి మరొకరికి సులభంగా వస్తుంది. ఒకవేళ గర్భిణీ తల్లికి గనక జీకా వచ్చినట్లయితే ఇక పుట్టబోయే బిడ్డకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది…

వర్షాకాలంలో దోమల బెడద పెరిగితే, జీకా వ్యాధి కూడా పెరుగుతుంది. ఈ వ్యాధికి ఇంతవరకు టీకా అనేది కనుక్కోలేదు. ఈ వ్యాధిని వీలైనంత తొందరగా నియత్రించటం ఒకటే మార్గం. ఈ వ్యాధిని గనక మొదట్లోనే గుర్తించినట్లయితే ఎలాంటి ప్రమాదాలు ఉండవు.ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే. ఈ జీకా యొక్క ప్రధాన లక్షణం జ్వరం. అలాగే తేలికపాటి జ్వరంతోపాటు, తలనొప్పి, కండరాలు,కీళ్ల నొప్పులు, అలసట, కడుపునొప్పి లాంటివి వస్తాయి. అంతేకాక చర్మం పై దద్దుర్లు, కడురెప్పల కింద భాగంలో మంట అనేది వస్తుంది. ఈ జీకా దోమ కుట్టిన తర్వాత 3 నుండి 14 రోజుల తర్వాత ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ఈ లక్షణాలు గనుక మీకు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి…

Zika virus జీకా వైరస్ వచ్చినప్పుడు కనపడే లక్షణాలు ఇవే

Zika virus : జీకా వైరస్ వచ్చినప్పుడు కనపడే లక్షణాలు ఇవే…

మీకు ఈ వ్యాధి అనేది సోకకుండా ఉండాలి అంటే దోమలకు ఎంతో దూరంగా ఉండాలి. ఈ జీకా ను నివారించేందుకు దోమల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా అవసరం. కావున ఇంటి లోపల మరియు చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అయితే నిల్వ ఉన్న నీటిలో ఈ దోమలు అనేవి అభివృద్ధి చెందుతాయి. అలాగే నీటిని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి మరియు రాత్రి పడుకునే టైమ్ లో దోమల తెరలను వాడటం అవసరం. దోమలు గనక ఎక్కువగా ఉన్నట్లయితే కాయిన్స్ లేక మస్కిటో రిపెల్లెంట్ ఆయిల్ లాంటివి వాడడం మంచిది. అంతేకాక ఫుల్లుగా బట్టలను కూడా ధరించాలి. అలాగే జికా వచ్చిన వ్యక్తులకు కూడా ఎంతో దూరంగా ఉండాలి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది