Inspirational Story : ఈ మహిళ చేసే పనికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.. తనకు చేతులెత్తి నమస్కరిస్తున్న స్థానికులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Inspirational Story : ఈ మహిళ చేసే పనికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.. తనకు చేతులెత్తి నమస్కరిస్తున్న స్థానికులు

 Authored By gatla | The Telugu News | Updated on :20 November 2021,7:15 am

Inspirational Story :  కొందరి దగ్గర చాలా డబ్బు ఉంటుంది. కానీ.. వాళ్లకు ఆ డబ్బును దానం చేసే గుణం మాత్రం ఉండదు. ఇంకొందరి దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. కానీ.. దాన్ని ఎవ్వరితో పంచుకోరు. నిజానికి.. మన దగ్గర ఉన్న డబ్బు, జ్ఞానం.. ఈ రెండింటిని ఇతరులతో పంచుకోవాలి అని పెద్దలు అంటుంటారు. తన దగ్గర డబ్బులు లేకున్నా.. తన దగ్గర ఉన్న విద్యను మాత్రం పది మందికి పంచి శెభాష్ అనిపించుకుంటోంది గుజరాత్ లోని జామ్ నగర్ కు చెందిన 49 ఏళ్ల రేఖా నందా.

gujarat jamnagar woman providing free education to poor children

gujarat jamnagar woman providing free education to poor children

రేఖా నందాకు రోజూ ఉదయాన్నే పార్కులో పక్షులకు ధాన్యాన్ని వేసే అలవాటు ఉంది. ఓరోజు రేఖ.. పక్షులకు గింజలు వేస్తుండగా.. అక్కడికి వచ్చిన కొందరు పిల్లలు తమకు ఆ ధాన్యాన్ని ఇవ్వాలంటూ కోరారు. దీంతో నేను ఆ ధాన్యాన్ని మొత్తం ఇచ్చేశారు. వాళ్లంతా వీధి బాలలు.. ఇంకొందరు భిక్షాటన చేస్తారు. తర్వాత తనకు అందరూ ఫ్రెండ్స్ అయ్యారు.

gujarat jamnagar woman providing free education to poor children

gujarat jamnagar woman providing free education to poor children

వాళ్లకు చదువుకోవాలనే ఆసక్తి ఉండటంతో రేఖా.. వెంటనే వాళ్లకు చదువు చెప్పడం ప్రారంభించింది. ఉచితంగా పిల్లలకు చదువు నేర్పిస్తోంది. ఓ పార్క్ వద్ద రేఖా.. వాళ్లకు రోజూ చదువు నేర్పిస్తుంది. అక్కడికి వాకింగ్ కు వచ్చేవాళ్లు కొందరు తనకు పిల్లలకు చదువు చెప్పే విషయంలో సాయం చేస్తుంటారు.

Inspirational Story :  రేఖతో పాటు పిల్లలకు తోడుగా నిలిచిన నవ్ నీత్ అనే వాకర్

అక్కడికి రోజూ వాకింగ్ కు వచ్చే నవ్ నీత్.. రేఖా పిల్లలకు చదువు చెప్పడం చూసి.. తను కూడా రేఖకు తోడుగా ఉంటున్నాడు. పిల్లలకు తను కూడా చదువు చెప్పడం.. వాళ్ల చదువు కోసం అయ్యే ఖర్చుల్లో కొంత భరిస్తున్నాడు. మొత్తానికి రేఖ చేసే ఈ పనిని చూసి చాలామంది గర్వపడుతున్నారు. కేవలం 12 వ తరగతి మాత్రమే చదివిన రేఖ.. తన సొంత పనులను కూడా వదులుకొని.. పిల్లల చదువు కోసం సమయం కేటాయిస్తోంది.

gujarat jamnagar woman providing free education to poor children

gujarat jamnagar woman providing free education to poor children

మా గురువు గారు నాకు ఒకే విషయం చెప్పారు. నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పదిమందితో పంచుకో అన్నారు. అందుకే నాకు తెలిసిన విద్యను ఆ పిల్లలకు నేర్పిస్తున్నాను. రేపు పెద్దయ్యాక వాళ్లు భిక్షాటన చేయకుండా.. ఏదో ఒక పనిచేసుకొని బతికితే చాలు.. నాకు అదే తృప్తి అంటూ చెప్పుకొచ్చింది రేఖ.

(Photos Credit : BBC Telugu)

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది