Inspirational News : 15 నిమిషాల్లో ప్రమాదం జరిగిన చోటుకు అంబులెన్స్.. ఈ నెంబర్ కు డయల్ చేస్తే వెంటనే అంబులెన్స్ వస్తుంది
Inspirational News : మీరు రెడ్ అంబులెన్స్ అనే పేరు విన్నారా? సాధారణంగా 108 అంబులెన్స్ లు తెలుసు కానీ.. ఈ రెడ్ అంబులెన్స్ ఏంటి అంటారా? నిజానికి 108 అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన అంబులెన్స్ లు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కూడా సొంతంగా అంబులెన్స్ సేవలను వినియోగిస్తుంటారు. అయితే.. 108 కు ఫోన్ చేస్తే ప్రమాదం జరిగిన చోటుకు అంబులెన్స్ రావడానికి కనీసం అర్ధగంట లేదంటే గంట కూడా పడుతుంది. కొన్ని సార్లు ఇంకా సమయం కూడా లేట్ అవుతుంది.
కానీ.. 1800 121 911 911 అనే నెంబర్ కు కాల్ చేస్తే 15 నిమిషాల్లో అంబులెన్స్ మీ ముందు ఉంటుంది. దాన్నే రెడ్ అంబులెన్స్ అంటారు. ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన అంబులెన్స్ కాదు. ప్రభ్ దీప్ సింగ్ అనే వ్యక్తి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఆయనే ఈ అంబులెన్స్ సర్వీస్ లను తీసుకొచ్చేది. స్టాన్ ప్లస్ అనే కంపెనీ ఈ అంబులెన్స్ సర్వీసులను తీసుకొచ్చింది. 6 సెకన్లలో ఎమర్జెన్సీ కాల్స్ ను పికప్ చేసుకొని, 4 నిమిషాల్లో అంబులెన్స్ రోడ్డెక్కుతుంది. 15 నిమిషాల లోపే ప్రమాదం జరిగిన ప్లేస్ కు అంబులెన్స్ వెళ్తుంది.
Inspirational News : 50 ఆసుపత్రులతో 6 నగరాల్లో అంబులెన్స్ సేవలు
ప్రస్తుతం రెడ్ అంబులెన్స్ సేవలు 50 ఆసుపత్రుల్లో ఉన్నాయి. హైదరాబాద్, రాయ్ పూర్, బెంగళూరు, కొయంబత్తూర్, భువనేశ్వర్, విశాఖపట్టణం నగరాల్లో ప్రస్తుతం రెడ్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో 500 ఆసుపత్రులతో టైఅప్ అయి 15 నగరాల్లో విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే 18 నెలల్లో సేవలను విస్తరించి 8 నిమిషాల్లో అంబులెన్స్ సేవలను అందించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ 20 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా సాధించింది. దీంతో త్వరలో అంబులెన్స్ సేవలను అన్ని రాష్ట్రాల్లో విస్తరించనుంది.
View this post on Instagram