Inspirational News : ఒకప్పుడు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ.800 కోట్లకు అధిపతి అయ్యాడు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Inspirational News : ఒకప్పుడు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ.800 కోట్లకు అధిపతి అయ్యాడు.. ఎక్కడో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :7 May 2023,3:00 pm

Inspirational News : ఒకప్పుడు పాలు అమ్మిన వ్యక్తి ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడని ఎవ్వరైనా ఊహించారా? మనిషిలో పట్టుదల ఉంటే ఏదైనా చేసేయొచ్చు అని నిరూపించాడు ఆయన. ఒకప్పుడు పాలు అమ్మి కష్టం విలువ తెలిసిన ఆయన ఇప్పుడు రూ.800 కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయన పేరే నారాయణ్ మజుందార్. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఈయన ఒకప్పుడు పాలు అమ్మాడు. కానీ.. కష్టపడ్డాడు. కసి, పట్టుదలతో ముందుకు వెళ్లాడు. నిరంతరం శ్రమించాడు. ఇప్పుడు పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు నారాయణ్.

నదియా జిల్లాలోని ఓ మారు మూల పల్లె. ఊళ్లోనే ఉన్న పాఠశాలలో చదువు పూర్తి చేశాడు. ఎన్డీఆర్ఐలో పై చదువుల కోసం చేరాడు. కోర్సు ఫీజు కట్టేందుకు డబ్బులు లేక పార్ట్ టైమ్ గా ఉదయం 7 గంటల వరకు పాలు అమ్మేవాడు. పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో కాలేజీ ఫీజు కట్టేవాడు. చదువు పూర్తయ్యాక.. కోల్ కతాలో ఓ ఐస్ క్రీమ్ కంపెనీలో పని చేయడం ప్రారంభించాడు. పలు డెయిరీ సంస్థలలో పని చేసిన తర్వాత 1999లో రూ.10 లక్షల పెట్టుబడితో శీతలీకరణ ప్లాంట్ ఏర్పాటు చేశాడు మజుందార్. ఆ తర్వాత కొన్నేళ్లకే రెడ్ కౌ డైరీని స్టార్ట్ చేశాడు.

Inspirational News : 10 లక్షల పెట్టుబడితో శీతలీకరణ ప్లాంట్ ఏర్పాటు

కోల్ కతా డెయిరీతో పార్టనర్ షిప్ కుదుర్చుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు వెయ్యి మంది పని చేసేలా తన సంస్థను రూపొందించాడు. 12 జిల్లాల్లో 3 లక్షల మంది రైతుల దగ్గర నుంచి పాలు కొంటారు. ఇప్పుడు తన కంపెనీ విలువ రూ.800 కోట్లు. ప్రతి రోజు వీళ్ల కంపెనీ 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. 35 పాల శీతలీకరణ ప్లాంట్స్ ఉన్నాయి. 400 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. చదువుకునే రోజుల్లో కోర్సు ఫీజు కోసం సైకిల్ మీద పాలు అమ్మిన వ్యక్తి ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే మాములు విషయం కాదు. ఇదంతా ఆయనకు పూలపాన్పు కాదు. చాలా కష్టపడ్డాడు. ఎంతో చెమటోడ్చి ఈ స్థాయికి చేరుకున్నాడు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది