Inspiring Story : మంచం దిగలేడు.. నడవలేడు.. కానీ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఈయన స్టోరీ తెలిస్తే శభాష్ అంటారు
Inspiring Story : బతకాలన్నా ఆశ, ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు.. ఏదైనా చేయొచ్చు.. దానికి అంగవైకల్యం కూడా అడ్డు కాదు అని నిరూపించాడు ఓ వ్యక్తి. మంచం దిగలేకపోయినా.. 24 గంటలు మంచానికే పరిమితం అయినా.. మంచి దిగి నడవలేకపోయినా.. ఇంట్లోనే మంచంలోనే పడుకొని కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన స్టోరీ ఏంటో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే. శభాష్ అనాల్సిందే. పదండి.. ఓసారి కేరళకు వెళ్లొద్దాం.ఆయన పేరు షాజవాస్. వయసు 47 ఏళ్లు. కేరళలోని కాసరగఢ్ జిల్లా ఆయన సొంతూరు.ఆయన కలప వ్యాపారం చేస్తుంటాడు. గత రెండు దశాబ్దాల నుంచి ఆయన కలప వ్యాపారం చేస్తున్నాడు. కానీ..
ఆయనకు 10 ఏళ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ వల్ల మంచానికే పరిమితం అయ్యాడు.2010లో ఓ రోజు కలప కొనుక్కొని రావడం కోసం షాజవాస్ కర్ణాటకకు వెళ్లాడు. అక్కడ కలప కొని.. లారీలో వేసుకొని వస్తున్నారు. తను, తన ఫ్రెండ్ కారులో వస్తున్నారు. అప్పటికే రాత్రి అయింది. కారు అప్పుడే బార్డర్ దాటి కేరళలోకి వెళ్తోంది. అదే సమయంలో కారు డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ అజాగ్రత్తగా చేస్తున్నాడు.ఆ విషయం గమనించిన షాజవాస్.. వెంటనే డ్రైవర్ ను అప్రమత్తం చేశాడు. కానీ.. అప్పటికే జరగరాని ఘోరం జరిగింది.కారు డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో కారు పల్టీలు కొట్టి రోడ్డు అవతల పడిపోయింది. తన తల ఓ బండరాయికి ఢీకొట్టింది.

kerala businessman earning crores after bed ridden with timber business
Inspiring Story : యాక్సిడెంట్ వల్ల మంచానికే పరిమితం అయిన షాజవాస్
దీంతో షాజవాస్ స్పృహ తప్పి పడిపోయాడు. వెనుక వస్తున్న లారీ.. ఆపి అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.కానీ.. అక్కడ ట్రీట్ మెంట్ చేయడం కుదరదు అంటే మంగళూరుకు తీసుకెళ్లారు. తన వెన్నముక తీవ్రంగా దెబ్బతినడంతో.. వెల్లూరులోని మంచి ఆసుపత్రికి తరలించి.. అక్కడ ట్రీట్ మెంట్ చేయించారు. అయినా కూడా షాజవాస్ మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది.ఆయన లేవలేడు.. నడవలేడు కానీ.. మిగతా అవయవాలన్నీ సరిగ్గానే పనిచేస్తాయి. దీంతో కొన్ని నెలలు రెస్ట్ తీసుకొని.. తిరిగి తన పని ప్రారంభించాడు.
తన కలప వ్యాపారాన్ని పడుకొని చేయడం ప్రారంభించాడు. తనకు.. తన భార్య, కూతురు పనిలో సాయం చేస్తారు. ఇంట్లోనే మంచంలో పడుకొని వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఫోన్ లోనే అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు షాజవాస్. ఇప్పుడిప్పుడే వ్యాపారం కూడా గాడిలో పడింది. దీంతో మళ్లీ కోట్లు గడిస్తున్నాడు. మంచంలో పడుకొని.. కోట్లు సంపాదిస్తూ.. కేరళలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు షాజవాస్.