Mud Home : 4000 ప్లాస్టిక్ బాటిల్స్ తో సూపర్ ఇల్లు నిర్మించారు.. ఎక్కడో తెలుసా?
Mud Home : ప్లాస్టిక్ బాటిల్స్ మనం ఏం చేస్తాం.. వాటితో ఏం అవసరం అని బయట పడేస్తాం. కానీ.. ఈ వ్యక్తి మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ తో ఏకంగా ఒక ఇంటినే నిర్మించాడు. మట్టి, ప్లాస్టిక్ బాటిల్స్ తో కలిసి బ్రహ్మాండమైన ఇంటిని నిర్మించాడు. విను డేనియల్ అనే ఆర్కిటెక్ట్ ఈ ఇంటిని నిర్మించాడు. వాల్ మేకర్స్ అనే ఒక ఆర్కిటెక్ట్ కంపెనీకి ఓనర్. తమిళనాడులోని ఓ ఫామ్ హౌస్ లో ఓ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ఆయన కంపెనీకి ఒక రిక్వెస్ట్ వచ్చింది.
ఆ ఫామ్ హౌస్ చాలా దూరంలో అడవిలో ఉంటుంది. అక్కడ అన్నీ రాళ్లు రప్పలే ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు. అక్కడ నివాసం ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ.. అలాంటి ప్రాంతంలో ఉండటానికి ఒక గెస్ట్ హౌస్ కావాలని చెప్పడంతో ఆ రాళ్ల మీద కాంక్రీట్ ఇల్లు నిర్మించడం కుదరదు. దీంతో చెట్ల మధ్య మంచి మట్టి ఇల్లు నిర్మించాలని అనుకున్నాడు. ఫామ్ హౌస్ లో ఒక చింత చెట్టు ఉంది.
Mud Home : చెట్ల మధ్యలో బ్రహ్మాండమైన మట్టి ఇల్లు నిర్మాణం
ఆ చింత చెట్టు పక్కనే ఈ మట్టి ఇంటిని నిర్మించాలని అనుకున్నాడు విను. దాని కోసం 4000 ప్లాస్టిక్ బాటిల్స్, మట్టి, స్టీల్ మెష్, దుంగలతో బెస్ట్ ఇంటిని నిర్మించాడు. అడవుల్లో కాంక్రీట్ నిర్మాణానికి బదులు.. ఆ రాళ్ల మీద బెస్ట్ గా ఉండేలా మట్టి ఇంటిని నిర్మించి శెభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంటిని చూసిన జనాలు.. తమకు కూడా అటువంటి ఇంటిని నిర్మించాలంటూ అతడి కంపెనీ ముందు క్యూ కడుతున్నారట. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.