Mother Inspirational Story : ఈ తల్లి ఓపికకు శతకోటి దండాలు… ఈ తల్లి కథ వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే… వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mother Inspirational Story : ఈ తల్లి ఓపికకు శతకోటి దండాలు… ఈ తల్లి కథ వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే… వీడియో !

 Authored By aruna | The Telugu News | Updated on :27 February 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Mother Inspirational Story : ఈ తల్లి ఓపికకు శతకోటి దండాలు...ఈ తల్లి కథ వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే...!

Mother Inspirational Story : ఈ భూ ప్రపంచంలో ఎక్కడ వెతికిన ఎంత డబ్బు పెట్టిన కొనలేని ఒకే ఒక్కటి తల్లి ప్రేమ. అలాంటి తల్లి ప్రేమను పొందాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. తన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా సరే తల్లివారికి అండగాా నిలబడుతుంది. ఎంత కష్టం వచ్చినా సరే విడిచిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. అయితే అలాంటి మాతృమూర్తులు మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో ,మన మండలాలలో ,మన గ్రామాలలో చాలామంది ఉన్నారు. అలాంటివారిలో శ్రీమతమ్మ కూడా ఒకరు అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 25 నుండి 30 సంవత్సరాలు కలిగి ఉన్న ముగ్గురు కొడుకులను కూడా ఇప్పటికి ఆమె కంటికి రెప్పలా కాచుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. ఆమె ముగ్గురు కొడుకులు వికలాంగులు అవడంతో వారు ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి. అయినా కూడా ముగ్గురు కొడుకులను వదిలిపెట్టకుండా ఇప్పటికీ కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తోంది శ్రీమతమ్మ… ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే…

హైదరాబాద్ మహానగరంలోని ఘట్కేసర్ మండల్ చెంగిచెర్లకు చెందిన గగలపల్లి శ్రీమతమ్మ తన ముగ్గురు కుమారులతో కలిసి గత కొంతకాలంగా అదే ప్రాంతం లో నివాసం ఉంటున్నారు. అయితే ఆమె భర్త నాలుగు సంవత్సరాల క్రితం మరణించడంతో ఆ ముగ్గురు కొడుకులు బాధ్యత పూర్తిగా శ్రీమతమే చూసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ ముగ్గురు కొడుకులు కూడా పుట్టుకతోటే వికలాంగులు అవడంతో వారి పనులు కూడా వారు చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో కూడా వారిని వదిలిపెట్టకుండా శ్రమతమ్మ తన ముగ్గురు కొడుకులను కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తున్నారు. ఇక ఇక్కడ ముగ్గురు కొడుకులు ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి ఉండడంతో శ్రీమతమ్మ బయటకు వెళ్లి పని కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి జీవనం సాగించడం కూడా చాలా కష్టతరంగా మారింది. అయినప్పటికీ వారిని వదిలిపెట్టకుండా శ్రీమతమ్మ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఆమె పడుతున్న ఇబ్బంది గమనించిన ఓ మీడియా సంస్థ తాజాగా ఆమెను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంతేకాక ఈమె వివరాలను రామ్ ఫౌండేషన్ కు అందించడంతో వారికి ఆర్థిక సాయం చేసేందుకుగాను రామ్ ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చింది.

అయితే ఎంత సహాయం చేసినప్పటికీ ముగ్గురు కొడుకులు ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఇప్పటికీ వారిని వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న శ్రీమతిమ్మకు శతకోటి దండాలు పెట్టాల్సిందే. అలాంటి గొప్ప మాతృమూర్తి ప్రేమను పొందిన ఆ ముగ్గురు కుమారులు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులను సైతం వృద్ధాశ్రమాలలో చేర్పిస్తున్నారు. అలాంటి కుమారులు పిల్లలు నేటి సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్నారు. అలాంటి పిల్లలున్న ఈ సమాజంలో శ్రీమతమ్మ చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అయితే ఇలాంటివారిని మీడియా ద్వారా అందరికీ పరిచయం చేసి ఆర్థిక సాయం అందెలా చేస్తున్న మా మీడియా సంస్థలకి కూడా ధన్యవాదాలు. మీరు కూడా ఈ మాతృమూర్తికి మీ వంతు సహాయం చేయాలనుకుంటే శ్రీమతమ్మ గారి ఇంటి చిరునామా…. GATKESAR MANDAL , CHENGICHERLA – H NO 3 – 92.. మరి ఈ గొప్ప మాతృమూర్తి శ్రీమతమ్మకు మీరు కూడా ఒక లైక్ వేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది