ఈయన డాక్టర్‌ కాదు.. దేవుడు.. పేదలకు రూ.1కే వైద్యం..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ఈయన డాక్టర్‌ కాదు.. దేవుడు.. పేదలకు రూ.1కే వైద్యం..!

డాక్టర్లను సహజంగానే ప్రజలు దేవుళ్లతో పోలుస్తుంటారు. ఎందుకంటే వారు మనకు చికిత్స చేసి ప్రాణాలను నిలబెడతారు. అందుకనే డాక్టర్లను దేవుళ్లంటారు. అయితే ఈయన మాత్రం అంతకన్నా ఎక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే పేదలకు కేవలం రూ.1కే వైద్య సేవలను అందిస్తున్నాడు. ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాకు చెందిన శంకర్‌ రామచందని అక్కడి బుర్లా అనే ప్రాంతలో ఉన్న వీర్‌ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (విమ్‌సర్‌) అనే ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. […]

 Authored By maheshb | The Telugu News | Updated on :17 February 2021,11:30 am

డాక్టర్లను సహజంగానే ప్రజలు దేవుళ్లతో పోలుస్తుంటారు. ఎందుకంటే వారు మనకు చికిత్స చేసి ప్రాణాలను నిలబెడతారు. అందుకనే డాక్టర్లను దేవుళ్లంటారు. అయితే ఈయన మాత్రం అంతకన్నా ఎక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే పేదలకు కేవలం రూ.1కే వైద్య సేవలను అందిస్తున్నాడు.

this odisha doctor opened one rupee clinic for poor people

this odisha doctor opened one rupee clinic for poor people

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాకు చెందిన శంకర్‌ రామచందని అక్కడి బుర్లా అనే ప్రాంతలో ఉన్న వీర్‌ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (విమ్‌సర్‌) అనే ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గతంలో ఆయన అక్కడే సీనియర్‌ రెసిడెంట్‌గా ఉన్నాడు. కానీ ఆ బాధ్యతల్లో ఉంటే సొంతంగా ప్రైవేటు ప్రాక్టీస్‌ పెట్టేందుకు వీలు లేదు. అందువల్ల ఆయన రూ.1 హాస్పిటల్‌ పెట్టలేకపోయాడు. అయితే ఇటీవలే ఆయనకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. దీంతో ఆ పదవిలో ఉంటే ప్రైవేటు ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు. కనుక ఆయన తన ఇంట్లోనే రూ.1 క్లినిక్‌ను ప్రారంభించారు.

this odisha doctor opened one rupee clinic for poor people

this odisha doctor opened one rupee clinic for poor people

డాక్టర్‌ శంకర్‌ ఇటీవలే రూ.1 క్లినిక్‌ ప్రారంభించగా ఆ క్లినిక్‌కు చక్కని స్పందన లభిస్తోంది. ఎంతో మంది పేదలు నిత్యం ఆయన క్లినిక్‌ వద్దకు వైద్యసేవల కోసం వస్తున్నారు. ఆ క్లినిక్‌ను ప్రారంభించిన తొలి రోజు 30 మందికి పైగా వచ్చారంటే.. ఆయన పాపులర్‌ అయ్యారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయన క్లినిక్‌ ఉంటుంది. అక్కడ వైద్య సేవల కోసం ఎంతో మంది వస్తున్నారు.

ఇదే విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయాడని, ఆయన చనిపోయేందుకు ముందు ప్రైవేట్‌ క్లినిక్‌ పెట్టుకోమని సలహా ఇచ్చాడని, కానీ ఆ క్లినిక్‌ పెడితే పేదలకు ఇలా రూ.1కే వైద్యం చేయలేనని చెప్పానని, కనుకనే ప్రైవేటు హాస్పిటల్‌ను పెట్టలేదని తెలిపాడు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకే తాను ఇంట్లోనే క్లినిక్‌ను ఏర్పాటు చేశానని తెలిపాడు. ఇక రూ.1 ఎందుకు అనడిగితే.. అంత మొత్తం కూడా ఇవ్వకుండా వైద్యం అందించవచ్చు. కానీ వైద్యం కోసం వచ్చే వారికి మరీ ఉచితంగా సేవలు పొందడం కూడా ఇష్టం ఉండదు. రూ.1 అయితే తాము ఎంతో కొంత చెల్లించే వైద్య సేవలు పొందుతున్నామనే భావన కలుగుతుంది. ఉచితంగా వైద్యం పొందడం లేదని అనుకుంటారు. ఇది వారిని సంతృప్తిగా ఉంచుతుంది. అందుకనే రూ.1 తీసుకుంటున్నా.. అని తెలిపారు. ఈ డాక్టర్‌ లాంటి వారు దేశంలో అన్ని చోట్లా ఉంటే అప్పుడు పేదలు వైద్య సేవలకు ఇబ్బంది పడే అవకాశం ఉండదు కదా..!

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది