Inspirational News : వంటలు వండటానికి లక్షల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు…!!
Inspirational News : అవినాష్ పట్నాయక్ ది ఒడిశా రాష్ట్రం. అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కానీ.. ఆ ఉద్యోగం అతడికి సంతృప్తిని ఇవ్వలేదు. అతడికి ఆహార రంగం మీద, మొక్కలు, పువ్వుల మీద ఆసక్తి ఉండేది. దీంతో వాటి మీద రీసెర్చ్ చేసేందుకు లక్షల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి స్థానికంగా చర్చనీయాంశమయ్యాడు. అతడి టాలెంట్, డెడికేషన్ వల్ల మాస్టర్ చెఫ్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టులుగా నిలిచిన 16 మందిలో ఒకడిగా నిలిచాడు. మాస్టర్ చెఫ్ పోటీల్లో పాల్గొన్న అవినాష్.. ఒడిశాకు చెందిన చాలా పాత వంటకం గైంత పిత అనే దాన్ని తయారు చేసి జడ్జిలు ఫిదా అయ్యేలా చేశాడు. అది నార్త్ ఒడిశాకు చెందిన ఒక చేప వంటకం.
నిజానికి అవినాష్ కు వంటలు వండటం అంటే చాలా ఇష్టం. మొక్కల మీద రీసెర్చ్ చేయడం ఇష్టం. రకరకాల వంటలు వండటం ఇష్టం. అందుకే ఆ ఇష్టాన్నే కెరీర్ గా మార్చుకొని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒడిశాకు చెందిన పలు వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడమే అవినాస్ ప్రధాన లక్ష్యం అట. అందుకే ఓవైపు మొక్కల మీద రీసెర్చ్ చేసేందుకు పీహెచ్‌డీ చేస్తూనే మరోవైపు ఫుడ్ మీద తనకు ఉన్న ప్యాషన్ ను కొనసాగిస్తున్నాడు అవినాష్. ప్రస్తుతం మాస్టర్ చెఫ్ లో అవినాష్ ఎంపిక అయినప్పటికీ.. అంత దూరం వెళ్లడానికి అవినాష్ చాలా కష్టపడ్డాడు.
Inspirational News : ఒడిశా వంటకాలకు ప్రపంచానికి పరిచయం చేయడమే అవినాష్ లక్ష్యం
ప్రభుత్వ ఉద్యోగం మానేయగానే ఇతడికి పిచ్చి పట్టిందా అని సొంత వాళ్లే అన్నారట. బంధువులు అతడితో మాట్లాడటం కూడా మానేశారట. 24 గంటలు మొక్కలు, ఫుడ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడట అవినాష్. ఆ ఆలోచనే తనను ఈ రంగం వైపు తీసుకొచ్చింది అని చెబుతున్నాడు. మన తాతలు, ముత్తాతలు ఏం తినేవారో మనకు తెలియదు. అలా.. పాతకాలం నాటి వంటకాలు కనుమరుగు కాకూడదు అనే ఉద్దేశంతోనే ఒడిశాకు చెందిన పాతకాలం నాటి వంటకాలు అన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఒడిశాలో ప్రస్తుతం అవినాష్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు.