Kadapa.. మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
కడప నగరంలో నిరుద్యోగ మహిళలకు, యువతులకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రం మేనేజర్ శివశంకర్ బుధవారం తెలిపారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకుగాను, మహిళలు, యువతులకు జాబ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసేందుకుగాను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి అందరికీ విదితమే. మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఈ ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన దారి చూపిస్తుందని మేనేజర్ శివశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు మహిళలు ప్రయత్నిస్తుండటం శుభపరిణామం అని అన్నారు.
ఇకపోతే టైలరింగ్‌లో శిక్షణ పొందాలనుకున్న జిల్లాకు చెందిన యువతులు, మహిళలు ఈ నెల 17 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఎవరైనా ఏడో తరగతి లేదా అంతకంటే పైన విద్యార్హత కలిగిన వారందరూ టైలరింగ్ నేర్చుకోవచ్చన్నారు. ఇందుకు వారు ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. మరిన్న వివరాలకు వారు 77020 66525 నెంబర్‌లోనూ సంప్రదించొచ్చని పేర్కొన్నారు.