Kadapa..తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు
ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు లభిస్తాయని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు సోమవారం తెలిపారు. ఆయన పెండ్లిమర్రి మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేయాలని కోరారు. మండలంలోని చెన్నంరాజుపల్లె గ్రామంలో ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన చామంతీ పంటలను ప్రాజెక్టు మేనేజర్ పరిశీలించి రైతుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల రైతులకు లాభం పెరగడంతో పాటు ఖర్చు తగ్గుతుందన్నారు.
ఈ క్రమంలోనే పంటల్లో తెగుళ్ల నివారణకుగాను కషయాల తయారీ గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. ఈ విధానం ద్వారా రైతులకు లాభం జరుగుతుందని వివరించారు. ఇతర విధానాల్లో పంటలు సాగు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని చెప్పారు. ఇకపోతే వ్యవసాయంలో ఇటీవల కాలంలో కెమికల్స్ యూసేజ్ బాగా పెరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇలా కెమికల్స్ బాగా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే చాన్సెస్ ఉంటాయి.