N95 Mask : N95 మాస్క్‌ను ఎన్ని సార్లు యూజ్ చేయొచ్చు? దాని లైఫ్ టైం ఎంత?
N95 Mask : కరోనాకు ముందు N95 మాస్క్ అంటే ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం దానిని వాడని వారంటూ ఎవరూ లేరని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లు దాటుకుని హమ్మయ్యా.. అనుకునే టైంలో తిగిరి ఒమిక్రాన్ విజృంభిస్తోంది. థర్డ్‌వేవ్ సైతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరిగా మారింది. కరోనా సోకకుండా అరికట్టడంలో N95 మాస్క్ చాలా ప్రభావ వంతమైనది చాలా మంది భావిస్తున్నారు. మరి నిజంగానే ఈ మాస్క్ అంతగా కరోనాను అరికట్టడంలో సహాయపడుతుందా? దీని డిమాండ్ ఎంత?
దీని లైఫ్ లైం ఎంత? అనే విషయం గురించి ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కల్లోలం సృష్టిస్తోంది. కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ N95 మాస్క్ తప్పకుండా ధరించాలని గతంలోనే డాక్టర్లు సూచించారు. ఈ మాస్క్‌లో పాలీ ప్రొఫైలిన్ అనే ఫైబర్ ఉంటుందట. బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములను బయటనే ఆపేస్తుంది. యాంత్రిక, స్థిర విద్యుత్ ను ఒకే టైంలో ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉంటుంది.
N95 Mask : ఎలా యూజ్ చేయాలంటే..?
కాబట్టి వైరస్ నియంత్రణలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ మాస్కును సరిగ్గా వాడుకుంటే చాలా రోజుల వరకు యూజ్ చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. మాస్క్ ముడతలు పడటం, మురికిగా మారడం, తడిగా మారితే అది పాడైపోయినట్టు భావించాలి. ఇక దానిని వాడకూడదు. మాస్క్ వాడే టైంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ వాడిన తర్వాత దాని ముందు ప్రాంతాన్ని టచ్ చేయొద్దు. మాస్క్ ను ధరించేటప్పుడు, తీసెటప్పుడు కేవలం దాని తాడులను మాత్రమే పట్టుకోవాలి. లేదంటే ఒక వేళ మాస్క్ పైన కరోనా వైరస్ ఉంటే అది మన చేతుల ద్వారా ముక్కు లేదా నోరు, కళ్లలోకి ప్రవేశించే చాన్స్ ఉంటుంది.